వచ్చే ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ కి చెందిన కమలా హరీస్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నట్లుగా ప్రకటన ఇచ్చిన విషయం విదితమే.అయితే కమలా ఈ ప్రకటన అలా చేసిందో లేదో కానీ భారీ ఎత్తున ఆమెకి మద్దతుగా విరాళాలు వచ్చి పడ్డాయి.ఆమె స్వయంగా ప్రకటించిన 24 గంటల్లోగానే దాదాపు
1.5 మిలియన్ డాలర్ల విరాళాలు ఇచ్చారు అమెరికన్స్.కొద్ది రోజుల క్రితం ఏబీసీ ఛానల్‌లోని “ గుడ్ మార్నింగ్ అమెరికా” అనే కార్యక్రమంలో హారిస్ తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం విధితమే.అయితే ఆ ప్రకటన చేసిన అనంతరం ఒక్కరోజులోనే దాదాపు 38వేల మంది దాతలు 1.5మిలియన్ డాలర్లను ఆమె ప్రచారం కోసం విరాళంగా ఇచ్చారని ఫాక్స్ న్యూస్ వెల్లడించింది.
అయితే ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా కూడా ప్రకటించారు.నాకు కేవలం 24 గంటల్లో 1.5మిలియన్ డాలర్లు మించి డొనేషన్స్ వచ్చాయని అందరికి కృతజ్ఞతలు అంటూ ఆమె ట్వీట్ చేశారు.నిజానికి ప్రకటన చేసిన 12 గంటల్లోనే మిలియన్ డాలర్లు వచ్చినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.హారిస్ తల్లి భారతీయురాలు కాగా తండ్రి కరేబియన్.కమల హారీస్ కి అమెరికాలోని భారత సంతతి వ్యక్తుల నుంచీ పూర్తి మద్దతు ఉండటం గమనార్హం.