గత సంవత్సరం అమెరికాలోని కాలిఫోర్నియా లో ఎస్ మీటే నేషనల్ పార్క్ లో కేరళాకి చెందిన ఓ యువజంట టెకీ చేస్తూ లోయలో పడి మరణించిన విషయం విదితమే.అయితే వారు అక్కడ ఎలా చనిపోయారు.
ఎవరన్నా చంపేశారా లేదంటే ప్రమాద వశాత్తూ జరిగిందా అనే విషయాలు అతి పెద్ద సవాలుగా మారాయి కాలిఫోర్నియా పోలీసులకి దాంతో విచారణ మొదలు పెట్టిన పోలీసులు అసలు నిజాలు వెల్లడించారు.
ఆ ఇద్దరు లోయలో పడి మరణించడానికి అసలు కారణం మద్యం సేవించడమే అంటూ తేల్చారు.స్థానిక మీడియా తెలిపింది.మృతుల అటాప్సీ రిపోర్టులో ఈ విషయం వెల్లడైనట్లు మీడియా వెల్లడించింది.
ప్రమాదం జరిగిన సమయంలో వారిరువురు ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నారని మారిపోసా కంట్రీ అధికారి ఆండ్రియా స్టెవర్ట్ తెలిపారు.అయితే డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్లు ఏమీలేవు.
వారు ఇరువురు లోయలో పడిపోవడానికి కారణం కూడా అదే అయి ఉంటుందని ఆండ్రియా వ్యాఖ్యానించారు.అయితే కొత్తగా పెళ్లి చేసుకుని ఎన్నో ఆశలతో అమెరికా వెళ్ళిన ఈ జంట చివరికి ఎంతో భవిష్యత్తు ఉండగానే ఇలా మరణించడం వారి కుటుంభాన్ని , సన్నిహితులని కలిచి వేసింది.వారు ఇరువురు తమ ట్రెక్కింగ్ విషయాలని సోషల్ మీడియాలో అందరితో పంచుకునే వారు.