పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ ”కల్కి 2898 ఏడి( Kalki 2898 AD )”.పాన్ వరల్డ్ మూవీగా టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ఇందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్ వంటి స్టార్స్ భాగం అవ్వడంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది.
ముఖ్యంగా ఇటీవలే కమల్ హాసన్ ( Kamal Haasan )సెట్స్ లో జాయిన్ అవ్వడంతో ఇలాంటి సెన్సేషనల్ స్టార్ ఈ సినిమాలో నెగిటివ్ రోల్ చేయడానికి ఎలా ఒప్పుకున్నారు అనే సందేహం ఆయన ఫ్యాన్స్ కు సైతం కలిగింది.ఈ క్రమంలోనే కమల్ హాసన్ తాజాగా తాను ఈ సినిమాలో ఈ రోల్ చేయడానికి ఎందుకు ఒప్పుకున్నా అనే దానిపై క్లారిటీ ఇచ్చారు.శాన్ డియాగో కామిక్ కాన్ లో అట్టహాసంగా ఈ సినిమాకు ”కల్కి 2898” అనే టైటిల్ ను ప్రకటించడమే కాకుండా గ్లింప్స్ కూడా రిలీజ్ చేయగా అదిరిపోయే సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది.
ఈ క్రమంలోనే టీమ్ అంతా నేషనల్ మీడియాతో ముచ్చటించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.కమల్ కూడా నెగిటివ్ రోల్ ఎందుకు ఒప్పుకున్నాడు అనేది తెలిపారు.
”నేను అనలాగస్ సినిమా నుండి వచ్చాను.నెగిటివ్ లేకుండా పాజిటివ్ లేదు.నెగిటివ్ సినిమాకు చాలా ముఖ్యం.అందుకే ఈ సినిమాకు ఒప్పుకున్నట్టు తెలిపారు.దీంతో కమల్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై 500 కోట్ల భారీ బడ్జెట్ తో అశ్వనీ దత్( Aswani Dutt) నిర్మిస్తుండగా సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.