జనసేన పార్టీ ఓకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఈ మధ్య కాలంలో వరుసగా అధికార పార్టీ వైసీపీ ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇంగ్లీష్ మీడియం విషయంలో జనసేన పార్టీ స్టాండ్ విరుద్ధంగా వైసీపీకి తన సంపూర్ణ మద్దతు తెలిపిన రాపాక వరప్రసాద్ తాజాగా మరోసారి అసెంబ్లీ లో జగన్ కి జై కొట్టారు.
అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీలకు సపరేట్ గా కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.దీనిపై జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక అసెంబ్లీలో మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలకు సమాజంలో స్థానం కల్పించాలనే ఆలోచన చాలా మంచిదని, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.
సీఎం జగన్ నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నామని అన్నారు.
వెనుకబడిన బడుగు బలహీన వర్గాల అందరూ కూడా వైయస్ జగన్ కి అండగా ఉన్నారని, వారి ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఎస్సీ ఎస్టీలకి వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేయడం మంచి నిర్ణయం అని ప్రశంసలు కురిపించారు.
అలాగే ఆటో కార్మికుల సమస్యలు తెలుసుకొని వారి సంక్షేమం కూడా జగన్ కృషి చేయడం అభినందనీయమని ప్రశంసించారు.ఓ వైపు అసెంబ్లీలో అధికార పార్టీకి మద్దతుగా మాట్లాడుతున్న రాపాక వరప్రసాద్ బయట మాత్రం మీడియా ముందు తన ప్రయాణం జనసేనతోనే అని చెప్పుకుంటూ రావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అయితే అధికార పార్టీకి వ్యతిరేకంగా వెళ్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారిని అసెంబ్లీలో రాపాక వరప్రసాద్ వినిపించడం లేదని ఇప్పుడు జనసేన కార్యకర్తలలో కూడా అభిప్రాయం వ్యక్తం అవుతోంది.మరి దీనిపై ఎమ్మెల్యే రాపాక ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.