తెలంగాణాలోని హుజూర్ నగర్ లో జరగబోతున్న ఉప ఎన్నికలు అన్ని పార్టీలను టెన్షన్ పెట్టేస్తున్నాయి.ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్ కు ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకం కావడంతో గెలుపు కోసం చాలా ఆరాటపడుతోంది.
హుజూర్ నగర్ లో గులాబీ జెండా రెపరెపలాడించాలని చూస్తున్న టిఆర్ఎస్ కు లోకల్ పాలిటిక్స్ చికాకు తెప్పిస్తున్నాడట.నేతల మధ్య సయోధ్య లేకపోవడం, స్థానికంగా కాంగ్రెస్ పార్టీకి ఇది కంచుకోట కావడంతో టీఆర్ఎస్ ఆందోళన చెందుతోంది.
ఇప్పటికే స్థానికంగా బలంగా ఉన్న సీపీఎం మద్దతు కూడగట్టుకున్నాఎక్కడలేని ఆందోళన ఆ పార్టీలో కనిపిస్తోంది.హుజూర్ నగర్ లో పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్న కెసిఆర్ పార్టీ పరిస్థితిపై స్థానిక నాయకులతో హుజూర్ నగర్ ఎన్నికల ఇంచార్జిలతో గెలుపు పై తరుచూ చర్చిస్తున్నారు.

స్వయంగా మీరు రంగంలోకి దిగక పోతే ఫలితం ఉండదని వారు కేసీఆర్ కు సూచిస్తున్నట్టు తెలుస్తోంది.దాదాపు పది రోజులుగా టిఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ లు అంతా హుజూర్ నగర్ లోనే మకాం వేసి మండలాల వారీగా ప్రచారాలు నిర్వహిస్తూ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తూనే ఉన్నారు.ఎప్పటికప్పుడు పరిస్థితులపై తమ అధినేత కెసిఆర్ కు నివేదికలు వారు నివేదికలు అందిస్తున్నారు.కెసిఆర్ కూడా ప్రైవేట్ సర్వేలు చేయించుకుంటూ టిఆర్ఎస్ బలాన్ని అంచనా వేస్తున్నారు.కాకపోతే ఆ ప్రైవేట్ సర్వేలు, ఇంటిలిజెంట్ సర్వేలలో హుజూర్ నగర్లో లో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, ఇక్కడ గెలుపు అంత సులువు కాదని తేలిందట.

అది కాకుండా టిఆర్ఎస్ అభ్యర్థి సైధి రెడ్డి పై సొంత పార్టీ నాయకులోనే సదభిప్రాయం లేకపోవడం, గ్రూపు రాజకీయాలు ఇవన్నీ టిఆర్ఎస్ విజయానికి అడ్డంకులుగా మారాయట.దీంతో ఆ పరిస్థితులను మార్చేందుకు సరికొత్త వ్యూహాలను అమలు చేసే ప్లాన్ లో కెసిఆర్ ఉన్నాడు.అంతేకాకుండా హుజూర్ నగర్ నియోజకవర్గంలో రెండు మూడు సభలు నిర్వహించాలని కెసిఆర్ ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
అధికారంలో ఉన్న పార్టీని గెలిపిస్తే కలిగే ప్రయోజనాలను కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ వారికి అర్ధమయ్యే రీతిలో చెప్పి ఓట్ల రూపంలో వారి ఆదరణ సంపాదించాలని కేసీఆర్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నాడు.ఏది ఏమైనా హుజూర్ నగర్ ఎన్నిక అయితే మాత్రం టీఆర్ఎస్ పార్టీలో ఎక్కడలేని గుబులు రేపుతోందని స్పష్టంగా అర్ధం అవుతోంది.