చంద్రబాబు భారీ స్కెచ్ లో భాగమే.. లగడపాటి – ఏబీఎన్ సర్వే

రెండు రోజుల క్రితం లగడపాటి మరియూ RG ఫ్లాష్ సర్వే సంయుక్తంగా నిర్వహించిన సర్వే అని చెప్తూ ఏబీఎన్ ఒక కధనాని ప్రచురించింది.ఏపీలో మళ్ళీ చక్రం తిప్పేది టీడీపినే అనేది ఆ సర్వే రిపోర్ట్ మళ్ళీ జగన్ కి ఏపీ ప్రజలు ఘలక్ ఇవ్వనున్నారు అని ఆ సర్వే తేల్చి చెప్పింది.

 Chandrababu Sketch Lagadapati Survey-TeluguStop.com

అయితే అందరూ ఊహించిన విధంగానే ఈ సర్వే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే వచ్చింది.అయితే ఇంట హుటాహుటినా ఈ సర్వే రిజల్స్ ఎందుకు చేశారు….? అయితే ఇప్పుడు మాత్రం ఎందుకు సర్వే ఫలితాలు బయటపెట్టాలి.? ఎందుకంటే.

లగడపాటి రాజగోపాల్ ఏపీలో చాలా కాలంగా సర్వేలు చేస్తున్నాడు.అంతేకాదు వీలు కుదిరినప్పుడల్లా ఆయన చంద్రబాబు ని కలుస్తూ ఏకాంతంగా చర్చలు జరిపిన సందర్భాలు అనేకం ఉన్నాయి.తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకోసమే ఆయన ఈ సర్వే చేస్తున్నారనే విషయం వారిద్దరి అత్యంత సన్నిహితులకు మాత్రమే తెలుసు.అడపాదడపా లగడపాటి రాజగోపాల్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయి తన సర్వే వివరాలను నేరుగా ఆయనకే అందిస్తున్నారు.

ఆ సర్వే ఆధారంగా చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు.

అయితే నిరంతరం తెలుగుదేశం పై కొనసాగే సర్వే ని ఇప్పటికిప్పుడు ఎందుకు బయట పెట్టినట్టు ఇంకా ఎన్నికలకియా సమయం చాలా దూరంలో ఉంది ఈ సమయంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనే అంశాన్ని పట్టుకుని ఎందుకు ఈ సర్వే బయటకి వచ్చింది అంటే ముఖ్యంగా బీజేపీ టార్గెట్ గా ఈ సర్వేను బయటపెట్టిందనేది విశ్లేషకుల మాట.తాము బలపడ్డాం.చంద్రబాబు సర్కార్ అబద్దాలు చెప్తోంది.

మేం చాలా చేశం.ప్రజలను టీడీపీ నేతలు మభ్యపెడుతున్నారు.

లాంటి అనేక మాటలు ఇటీవలికాలంలో బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు.అలాంటి వారిని కట్టడి చేయడంలో ఓ భాగమే ఈ సర్వే.

ఏపీ కి కేంద్రం ఎంత ఘోరమైన అన్యాయం చేసిందో తెలిపేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.దాన్ని పూడ్చుకోవడం బీజేపీకి అంత ఈజీ కూడా కాదు.

అయితే బీజేపీతో అంటకాగడం ద్వారా వైసీపీ కూడా దెబ్బతింటోదని ఈ సర్వే ద్వారా అర్థమవుతోంది.అంతేకాదు సర్వే తరువాత రోజునే చంద్రబాబు నీతి ఆయోగ్ మీటింగ్ కి వెళ్ళడం అక్కడ మోడీ లాంటివారిని కలవడం ఎలాగో జరుగుతుంది అయితే ఈ సర్వే రిజల్స్ కనుకా ముందే వస్తే.

చంద్రబాబు ని అనవసరంగా దూరం చేసుకున్నామా అనే సందేహం కలిగి పునరాలోచనలో పడుతారు అనేది చంద్రబాబు ప్లాన్ ఈ క్రమంలోనే బాబు ఢిల్లీ వెళ్ళే ముందు ఈ సర్వే రిజల్స్ వచ్చాయని అంటున్నారు అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఈ సర్వే అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి కారణం ఈ రిజల్స్ ఏబీఎన్ లాంటి చానెల్ లో కనిపించడమే అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube