యూత్‌లో యమ క్రేజీ ఉన్న నాయకుడు ఎవరంటే రేవంత్‌రెడ్డి అని టక్కున గుర్తుకు వస్తుంది.ప్రస్తుతం ఉన్న నాయకుల్లో రేవంత్ రెడ్డికి ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది.
అంతే కాకుండా అభిమానులకు, ప్రజలకు ఎక్కువగా దగ్గరగా ఉంటే రేవంత్ రెడ్డి అంటే విశేషమైన అభిమానం ఉన్న వారు కూడా ఉన్నారు.
ఇక ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి కేంద్రం పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశం రెండుగా విడిపోవడానికి జమిలి ఎన్నికలు కారణం అవుతాయని, ఆ తర్వాత దేశ విభజన ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుందని అన్నారు.అదీగాక మోదీ ప్రధాని అయ్యాక దక్షిణ రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గిపోగా, కీలకమైన పదవులన్నీ ఉత్తరాది వారికే కట్టబెడుతూన్నారని ఆరోపించారు.
ఇకపోతే దక్షిణాది రాష్ట్రాల వివక్షకు కారణమయ్యే జమిలి ఎన్నికల ఆలోచనను మోదీ విరమించు కోవాలని, లేనిపక్షంలో పార్లమెంటులో చర్చ లేవనెత్తుతామని పేర్కొన్నారు.ఇక వ్యవసాయ చట్టాల విషయంలో ప్రధాని మోదీని ఎవరో రిమోట్‌లా వాడుకుంటున్నారని అందుకే ఆ ఉద్యమాన్ని అణిచివేయడానికి, జాతీయ రహదారులను కిలోమీటర్ల మేర తవ్వడం దుర్మార్గమని, ఇలాంటి వారి పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ప్రజలను మోసం చేసే విషయంలో ఏం తక్కువ తినలేదని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.