గత ఎన్నికల సమయం నుంచి ఓ అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది.అదే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు.
జగన్ సొంత బాబాయ్ అయిన వివేకా హత్య కేసు మీద ఎప్పటి నుంచో రాజకీయ దుమారం చెలరేగుతోంది.ఇన్ని రోజులు జగన్ ఇమేజ్ తోనే వైసీపీ అధికారాన్ని కొనసాగిస్తోంది.
ఆ పార్టీలో చాలామంది గెలిచారంటే అది జగన్ వేవ్ అనే చెప్పాలి.జగన్ ను చూసే చాలామందిని ప్రజలు గెలిపించారు.
కాగా ఇప్పుడు వివేకా హత్య కేసులో మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన స్టేట్ మెంట్ తీవ్ర కలకలం రేపుతోంది.
ఆయన చెప్పిన దాన్ని బట్టి తెర వెనుక పెద్దలు ఉన్నారనే ప్రచారం సాగుతోంది.
దస్తగిరి వాంగ్మూలంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు వైఎస్ భాస్కరరెడ్డి లాంటి జగన్ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పడం తీవ్ర కలకలం రేపుతోంది.అయితే ఇంకా సీబీఐ దీన్ని అధికారికంగా ప్రకటించలేదు.
కేవలం ఇది దస్తగిరి వాంగ్మూలం మాత్రమే.అయినా సరే దీన్ని టీడీపీ వదలకుండా రాజకీయ అంశంగా మార్చేసింది.
టీడీపీ లీడర్స్ అంతా ఒక్క తాటిమీదకు వచ్చి ఇందులోకి జగన్‌ను లాగుతున్నారు.జగన్‌కు హంతకుల గురించి తెలిసినా మౌనంగా ఉంటున్నారని ఆరోపిస్తున్నారు.
ఇప్పటికే జగన్ సీఎం అయిన తర్వాత ఏపీలో ఫ్యాక్షన్ పెరిగిపోయిందని ఇప్పటికే చంద్రబాబు పదే పదే ఆరోపిస్తున్నారు.ఇలాంటి తరుణంలో దస్తగిరి వాంగ్మూలం వారికి మంచి అవకాశాన్ని ఇస్తోంది.
వివేకా హత్య జరిగినప్పుడు జగన్ తో పాటు అందరూ టీడీపీ, చంద్రబాబు మీదనే ఆరోపణలు చేశారు.కానీ ఇప్పుడు దస్తగిరి వాంగ్మూలం అటు వైసీపీకి , ఇటు జగన్‌కు షాక్ ఇస్తోంది.
దీనిపై వైసీపీ నేతలు డిఫెన్స్ లో పడిపోయారు.టీడీపీ చేస్తున్న ఆరోపణలకు పెద్దగా కౌంటర్ వేయలేకపోతున్నారు.
మొత్తంగా జగన్ ఇమేజ్ డౌన్ అయిపోతుందనే వార్తలు గుప్పుమంటున్నాయి.
.