మంచి నీళ్ల బావిలో ఏం వస్తుందో తెలిస్తే నోరెళ్లబెడతారు

మంచి నీళ్ల కోసం ఆ బావిలో తోడి చూడగా ఏం వచ్చిందో చూసి అక్కడున్నవారందరూ అవాక్కయ్యిన సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.గల్ఫ్ దేశాల్లో లభించే పెట్రోల్‌ను ఆ ఇంటి వారు తమ మంచినీటి బావిలో తోడి తీయడంతో ఇది చూసిన వారు కూడా నోరెళ్లబెట్టారు.

 Petrol Comes Out From Drinking Water Well-TeluguStop.com

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.కర్ణాటకలోని కర్వార్ నగరంలో పెట్రోల్ బావి బాగోతం బయటపడింది.

నాగవేణి అనే మహిళ తన ఇంటి ముందు ఉన్న మంచినీటి బావిలో రోజూలాగే నీటిని తోడింది.అయితే ఆమెకు నీళ్లు వాసన వచ్చాయి.

దీంతో ఆమె కుటుంబం కాంగారు పడి స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశారు.కాగా వారు వచ్చి ఆ బావిలో నీటిని పలుమార్లు పరిశీలించగా అది వాసన వచ్చింది.

దీంతో వారు ఆ నీటిని సేకరించి ల్యాబ్‌టెస్టుకు పంపించారు.కాగా టెస్టులో అది పెట్రోల్ నీటిలో కలవడం వలన అలా వాసన వచ్చిందని తేలింది.

పెట్రలో పంపు నుంచి పెట్రోల్ లీక్ అయ్యి అది బావిలో కలవడంతో ఇలాంటి వాసన వస్తుందని టెస్టులో తేలింది.కాగా నాగవేణి ఇంటి సమీపంలో పెట్రోల్ పంపు నుంచి ఈ పెట్రోల్ లీక్ అయ్యిందని వారు అనుమానిస్తున్నారు.

దీంతో అధికారులు దీని పరిష్కారం కోసం చర్యలు చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube