ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా విమర్శలు గుప్పించారు.పురంధేశ్వరి కాంగ్రెస్ లో ఉందా? టీడీపీలో ఉందా ? తేల్చాలని డిమాండ్ చేశారు.
పురంధేశ్వరి బీజేపీలో ఉన్నట్లు ఎక్కడా కనిపించడం లేదని కొడాలి నాని అన్నారు.పురంధేశ్వరి లేఖలకు భయపడేవారు ఎవరూ లేరని తెలిపారు.గతంలో జగన్, విజయసాయి రెడ్డిపై రాజకీయ కక్షతోనే టీడీపీ,కాంగ్రెస్ కేసులు పెట్టాయని చెప్పారు.అవినీతి జరగలేదని ఇవాళ కాకపోయినా రేపు అయినా కోర్టులు నిర్ధారిస్తాయని తెలిపారు.
ఛార్జ్ షీట్ల నంబర్లు వేసి హడావుడి చేసినంత మాత్రాన భయపడమని పేర్కొన్నారు.కాంగ్రెస్ కు మద్ధతు ఇవ్వడం వలనే టీటీడీపీ నుంచి కాసాని బయటకు వచ్చారన్న కొడాలి నాని కాంగ్రెస్ తో చంద్రబాబు ఉన్నారని స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు.