మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో విభిన్న కథా చిత్రాలలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.ఇక ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి హీరో హీరోయిన్స్ అంటే వారి మధ్య ప్రేమ పుట్టడం బ్రేకప్స్ జరగడం సర్వసాధారణం.
ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ కూడా హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) ప్రేమలో పడ్డారు.అయితే ఈయన తన ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచుతూ ఎట్టకేలకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.
ఈ విధంగా వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలో( Italy ) నవంబర్ ఒకటవ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.
మెగా కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది.
ఇలా పెళ్లి వేడుకలు ముగించుకొని ఈ జంట తిరిగే హైదరాబాద్ చేరుకున్నారు.మెగా కోడలుగా ఈమె మొదటిసారి హైదరాబాద్ కి రావడంతో హైదరాబాదులో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.
ఇక వీరి వివాహ రిసెప్షన్( Reception ) నవంబర్ 5వ తేదీ ఘనంగా జరగనుంది.ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వివాహం జరగడంతో వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే మెగా కుటుంబ సభ్యులు( Mega Family ) మాత్రమే కాకుండా అత్యంత సన్నిహితులు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు.
ఈ క్రమంలోనే నితిన్ ఫ్యామిలీ( Nithin Family ) కూడా వరుణ్ తేజ్ పెళ్లి వేడుకలలో( Varun Tej Marriage ) పాల్గొని సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే.నితిన్ తన భార్యతో పాటు తన అక్క బావలతో కలిసి ఈ పెళ్లి వేడుకలలో పాల్గొని సందడి చేశారు.ఇలా ఇండస్ట్రీలో తనకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి కొంతమందిని వారు పర్సనల్ గా కూడా ఇన్వైట్ చేశారంట అలాంటి వారిలో ఒక హీరోయిన్ కూడా ఉందని అయితే ఆ హీరోయిన్ ఇంటికి వెళ్లి మరి వరుణ్ తేజ్ పెళ్లికి రమ్మని ఇన్వైట్ చేసిన ఆమె మాత్రం పెళ్లికి రాకుండా ఉన్నారట.
ఇలా పెళ్లికి రాకుండా ఉండడంతో వీరి వ్యవహారం గురించి పెద్ద ఎత్తున అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
వరుణ్ తేజ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూనే నటి రాశి ఖన్నా (Rashi khannaa) తో కలిసి పలు సినిమాలలో నటించిన సంగతి మనకు తెలిసిందే.ఇలా వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు అయితే వరుణ్ తేజ్ రాశిఖన్నాను స్నేహితురాలిగా చూసినప్పటికీ ఆమె మాత్రం వరుణ్ ను ప్రేమించిందని తెలుస్తోంది.అయితే ఈమెది వన్ సైడ్ లవ్ కావటం విశేషం.
ఈమె వరుణ్ చాలా గాఢంగా ప్రేమించిందని, లావణ్య స్థానంలో తాను ఉండాలని కోరుకుందని తెలుస్తుంది.అయితే ఈమె తనని ప్రేమిస్తుందని తెలిసినప్పటికీ వరుణ్ మాత్రం తనని ఫ్రెండ్ గానే యాక్సెప్ట్ చేశారట.
ఈ క్రమంలోని ఇంటికి వెళ్లి మరి తన పెళ్లికి రావాలని చెప్పగా రాశి ఖన్నా మాత్రం తాను ప్రేమించిన వ్యక్తి మరొక అమ్మాయిని పెళ్లి తీసుకోవడం ఇష్టం లేక ఈ పెళ్లికి దూరంగా ఉన్నారు అంటూ తాజాగా మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా ఫాన్స్ మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నారు.శుభమా అంటూ పెళ్లి చేసుకున్నటువంటి ఈ జంట గురించి అప్పుడే ఇలాంటి వార్తలను సృష్టించడం ఏమాత్రం భావ్యం కాదని, అయినా లావణ్య త్రిపాఠితో ఈయన దాదాపు 6 సంవత్సరాలుగా ప్రేమలో ఉంటున్నారని వీరిద్దరి స్వచ్ఛమైన ప్రేమ అంటూ కొందరు అభిమానులు ఈ వార్తలను తిప్పి కొడుతున్నారు.