బిగ్ బాస్ సీజన్6 లో హాట్ టాపిక్ అయిన కంటెస్టెంట్లలో గీతూ రాయల్ కూడా ఒకరనే సంగతి తెలిసిందే.మొదట్లో ఈ కంటెస్టెంట్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చినా ఆమె వల్లే ఈ షో అంతోఇంతో ఎంటర్టైనింగ్ గా ఉందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
అయితే గీతూ రాయల్ భర్త తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.గీతూ రాయల్ భర్త పేరు వికాస్ కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరిగింది.
తమిళ నేపథ్య కుటుంబానికి చెందిన వికాస్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.ఒక యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడిన వికాస్ గీతూ రాయల్ ఆట ఆడుతున్న తీరు తనకు ఎంతగానో నచ్చిందని చెప్పుకొచ్చారు.
గీతూ రాయల్ బాగా ఆట ఆడుతోందని తన ఆటతీరు వల్ల ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ లభిస్తోందని వికాస్ కామెంట్లు చేశారు.టీవీలో భార్యను చూడటం విషయంలో సంతోషం కలుగుతోందని వికాస్ చెప్పుకొచ్చారు.
అదే సమయంలో గీతూ నా పక్కన లేకపోవడం వల్ల తనను మిస్ అవుతున్నాననే ఫీలింగ్ కలుగుతోందని వికాస్ కామెంట్లు చేశారు.
పెళ్లైనప్పటి నుంచి గీతూకు నేనెప్పుడూ దూరంగా లేనని గీతూకు దూరంగా ఉండటం ఇదే తొలిసారి అని వికాస్ చెప్పుకొచ్చారు.గీతూ మాట తీరు గురించి వికాస్ మాట్లాడుతూ తన మాట తీరే అంత అని వికాస్ తెలిపారు.గీతూ మాట్లాడితే రూడ్ గా మాట్లాడినట్టు ఉంటుందని వికాస్ వెల్లడించారు.
వాస్తవానికి గీతూ చాలా మృదు స్వభావి అని వికాస్ కామెంట్లు చేశారు.గీతూ రాయల్ పలకరింపులో కూడా ఏ మాత్రం సాఫ్ట్ నెస్ ఉండదని వికాస్ చెప్పుకొచ్చారు.బయట ఏ విధంగా ఉంటుందో బిగ్ బాస్ హౌస్ లో కూడా తను అదే విధంగా ఉంటుందని వికాస్ కామెంట్లు చేశారు.వికాస్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.