పదేళ్ల కుమార్తెను హత్య చేసిన కేసులో యూకేలో( UK ) ఓ భారత సంతతి మహిళపై బుధవారం అభియోగాలు మోపారు.ఇంగ్లాండ్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్‌లోని( West Midlands ) ఓ పట్టణంలోని ఇంట్లో చిన్నారిని ఆమె హత్య చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.
జాస్మిన్ కాంగ్( Jasmine Kang ) అలియాస్ జాస్కిరత్ కౌర్.( Jaskirat Kaur ) తన కుమార్తె షే కాంగ్‌ను( Shay Kang ) హత్యకు పాల్పడిన అభియోగంపై వోల్వర్‌హాంప్టన్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరయ్యారు.
వెస్ట్ మిడ్‌లాండ్స్ పోలీసులు సోమవారం రౌలీ రెగిస్‌లోని నివాసంలో బాలిక తీవ్ర గాయాలతో శవమై కనిపించినట్లు తెలిపారు.ఈ ఘటనపై వెస్ట్ మిడ్‌లాండ్స్ పోలీస్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ డాన్ జరాట్ మాట్లాడుతూ… చిన్నారి మరణం సమాజంపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు.
ఈ ప్రాంతంలో రాబోయే రోజుల్లో మా సపోర్ట్ వుంటుందని ఆయన పేర్కొన్నారు.
కౌర్‌ను సోమవారం ఆమె కుమార్తె మృతదేహం లభించిన ఇంట్లో నుంచి అరెస్ట్ చేశారు.షే కాంగ్ మరణానికి సరైన కారణాన్ని నిర్ధారించడానికి పోస్ట్‌మార్టం నివేదిక రావాల్సి వుంది.దర్యాప్తులో భాగంగా తాము మరెవరి కోసం వెతకడం లేదని పోలీసులు వెల్లడించారు.
షే చదువుకుంటున్న బ్రిక్‌హౌస్ ప్రైమరీ స్కూల్.( Brickhouse Primary School ) ఆమె మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
ఈ విషాద సమయంలో షే కుటుంబానికి మద్ధతు ఇవ్వడానికి తోటి విద్యార్ధులు, సిబ్బందితో కలిసి పనిచేస్తామని పాఠశాల యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది.
షే కాంగ్ నివసిస్తున్న రౌలీ రెగిస్ పట్టణంలోని రాబిన్ క్లోజ్‌లో పోలీస్ కార్డన్ సమీపంలో బొమ్మలు, కార్డులు, బెలూన్‌లతో పిల్లలు నివాళులర్పించారు.షే అంత్యక్రియల కోసం డబ్బును సేకరించేందుకు అదే పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్ధుల తల్లిదండ్రులు కొంతమంది ఆన్‌లైన్ గో ఫండ్ మీ( Go Fund Me ) నిధుల సేకరణను కూడా ఏర్పాటు చేశారు.ఇప్పటి వరకు 3,800 పౌండ్ల నిధులను సేకరించారు.
బాలికకు తల్లి తప్ప కుటుంబం లేదని.ఆమె అంత్యక్రియల కోసం నిధులు సేకరించి పూలు, రాతి వంటి వాటికి సహాయం చేయడానికి ముందుకొస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు.