భారతీయులు సహా ఎంతో మంది వలస దారులకి అమెరికా పౌరులతో పెళ్ళిళ్ళు చేయించి మోసాలకి పాల్పడుతున్న భారతీయ వ్యక్తిని అమెరికా కోర్టు దోషిగా తేల్చింది.దాంతో అతడికి దాదాపు 25 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
వివరాలలోకి వెళ్తే.
ఫ్లోరిడా రాష్ట్రం పనామా సిటీలో నివాసం ఉంటున్న రవిబాబు కొల్లా అనే 47 ఏళ్ల భారతీయ వ్యక్తి 2017-18 సంవత్సరాల్లో బే కౌంటీ ప్రాంతంలో ఉత్తుతి పెళ్ళిళ్ళు జరిపించాడు.
అక్కడి ప్రభుత్వం నుంచీ రాయితీలు అందేలా చేసేందుకు, స్థిర నివాసం ఉండేలా చేసేందుకు భారతీయుల సహా ఇతర వలసదారులకు అమెరికా పౌరులతో దాదాపు 80 వరకు పెళ్లిళ్లు జరిపించాడు.
అయితే అతడికి అమెరికా పౌరసత్వం ఉన్న ఓ మహిళ సహకరించింది.ఈ పెళ్ళిళ్ళకి అమెరికా పోవ్రసత్యం ఉన్న పనామా సిటీ, కల్హౌన్, జాక్సన్ కౌంటీ లకు చెందిన సుమారు 10 మందిని ఆమె ఎంపిక చేసింది.అయితే వీసాల కోసం ఇంతటి నేరానికి పాల్పడిన రవిబాబు కి రెండు శిక్షలకి గాను దాదాపు 25 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
.