అమలాపురం మాజీ ఎంపీ, దళిత నేత హర్ష కుమార్ ఈ రోజు టీడీపీలో చేరనున్నట్లు అధికారికంగా స్పష్టం చేసారు.చంద్రబాబు సమక్షంలో టీడీపీ పార్టీ తీర్ధం తీసుకోకున్నట్లు తెలియజేసారు.
ఇక హర్షకుమార్ కి అమలాపురం ఎంపీ టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు నుంచి హామీ రావడంతోనే టీడీపీలో చేరడానికి ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ రోజు టీడీపీ పార్టీలో చేరబోతున్న హర్షకుమార్ వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపైన సంచలన వాఖ్యలు చేసారు.
వైఎస్ వివేకానందపై జగన్ రెండు సార్లు చేయి చేసుకున్నారని, ఈ విషయం అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీలు అందరికి తెలుసని అన్నారు.జగన్ కారణంగా వివేకానంద చాలా మానసిక క్షోభ అనుభవించారని, అతనికి కనీసం గౌరవం కూడా ఇవ్వలేదని విమర్శించారు.
అలాంటి జగన్ ఈ రోజు వివేకానంద హత్యని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయడం ఆశ్చర్యంగా వుందని విమర్శలు చేసారు.