కరేబియన్ దేశం హైతీలో భద్రతా పరిస్ధితులు నానాటికీ క్షీణిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.అక్కడ నివసిస్తున్న 90 మంది భారతీయులను సురక్షితంగా తరలించాలని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది.
హైతీ ప్రధాని ఏరియల్ హెన్రీని( Haitian Prime Minister Ariel Henri ) బలవంతంగా రాజీనామా చేయించే చర్యల్లో భాగంగా పలు ముఠాలు హైతీలోని కీలకమైన ప్రదేశాలపై దాడులకు దిగాయి.హైతీలో 75 నుంచి 90 మంది భారతీయులు వున్నారు.
వీరిలో 60 మంది భారతదేశానికి తిరిగి రావడానికి రిజిస్టర్ చేసుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ( Randhir Jaiswal )వెల్లడించారు.తాము అందరిని ఖాళీ చేయించేందుకు సిద్ధంగా వున్నామని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు.హైతీలో భారతదేశానికి రాయబార కార్యాలయంలో లేదు.దీంతో డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగోలోని ( Santo Domingo ) భారతీయ మిషన్ ద్వారా దేశంలోని పరిస్ధితిని పర్యవేక్షిస్తున్నారు.విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ఇప్పటికే శాంటో డొమింగోలో, న్యూఢిల్లీలో కంట్రోల్ రూమ్‌లను ప్రారంభించి , ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది.
శాంటో డొమింగోలోని భారత రాయబార కార్యాలయం హైతీ రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్ , దేశంలోని ఇతర ప్రాంతాల్లో వున్న భారతీయులందరితో టచ్‌లో వుందని విదేశాంగ శాఖ తెలిపింది.
హైతీలో జరుగుతున్న పరిణామాలను పర్యవేక్షించడానికి, సమాచారం, సహాయాన్ని అందించడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖలో 24 గంటల కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్లు ఎంఈఏ ఒక ప్రకటనలో తెలిపింది.హైతీలోని క్రిమినల్ ముఠాలు పోలీస్ స్టేషన్లను, అంతర్జాతీయ విమానాశ్రయం, కొన్ని జైళ్లతో సహా దేశంలోని వివిధ కీలక ప్రదేశాలపై దాడులు నిర్వహించాయి.హైతీలో స్థిరపడిన భారతీయ సమాజంలో వైద్యులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, అనేకమంది మిషనరీలు వున్నారు.
కరేబియన్ కమ్యూనిటీ, కామన్ మార్కెట్ గవర్నింగ్ కౌన్సిల్ కోసం చర్చలు ప్రారంభించాయి.హైతీలో వున్న మదర్ థెరిసా స్థాపించిన కోల్‌కతాకు చెందిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీ( Missionaries of Charity ) నుంచి 30 మందికి పైగా సన్యాసినులను కూడా భారత్ సంప్రదించింది.