అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందినవిగా గుర్తింపు పొందాయి క్లబ్ లు మారుతున్న సాంకేతిక వ్యవస్థతో పోటీ పడలేక పోతున్నాయి.ఒకప్పుడు అమెరికాలోని కొన్ని క్లబ్ లలో ఎంట్రీ దొరకడమే కష్టం అనుకున్న తరుణంలో ఇప్పుడు ఆ క్లబ్ లలో జనాలు లేక మూతపదిపోయే పరిస్థితికి వచ్చాయి.
టీవీ, కంప్యూటర్స్, మొబైల్స్ తో సహవాసం చేస్తున్న ప్రజలు సహజ జీవితానికి దూరం అయ్యారు.అమెరికాలో ఈ పరిస్థితి మరీ అధికంగా ఉంది.
ఒకప్పుడు ఎన్నో రకాల క్లబ్బులతో ఉన్న చికాగో నగరం ఇప్పుడు జనాలు లేక బోసి పోతోంది.ఎన్నో క్లబ్ లు మూత పడ్డాయి.ఈ పరిస్థితిని తట్టుకునేందుకు ఇక్కడి చికాగో అథ్లెటిక్ క్లబ్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.ఒకప్పుడు ఈ క్లబ్ అత్యంత ఖరీదైనదిగా పేరొందింది.అయితే ఇక్కడ గతంలో పుర్షులకి మాత్రమే
ప్రవేశం ఉండేది స్త్రీలని అసలు రానిచ్చే వారు కాదు దాంతో ప్రస్తుత సంక్షోభం నుంచీ బయట పడటానికి దీనిలోకి మహిళలు కూడా రావచ్చని ప్రకటించారు.అన్ని వయసుల్లోని వారి ఎంట్రీ ఉందని తెలిపింది.ముఖ్యంగా పిల్లలకోసం ప్రత్యేకంగా ఫ్రీ గేమ్స్ కూడా ఉన్నాయని క్లబ్ ప్రకటించింది
.