ఎన్టీఆర్ బయోపిక్ గురించి అడగగానే ఆ ఒక్క మాటతో అందరి నోటికి తాళం వేసిన తేజ.! ఏమన్నారంటే.?

నందమూరి ఎన్టీఆర్ అంటేనే భారతీయత ఉట్టిపడేలా ఉంటుంది.తెలుగుదనం ప్రత్యక్షంగా కనిపిస్తుంది.

 Director Teja Sensational Comments On Ntr Movie-TeluguStop.com

తెలుగు జాతి ఉన్నంత వరకూ ఆయన ఖ్యాతి ఉంటూనే ఉంటుంది.తెలుగు చిత్ర సినిమాకి ఎంతో గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్ జీవిత చరిత్రని ఆయన తనయుడు హీరో ,ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ బయోపిక్ రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించారు.

అన్న గారి పాత్రలో బాలయ్య బాబు గారు ఒదిగిపోయారు అంటున్నారు సినిమా చూసిన వారంతా.

అయితే ఈ సినిమాని మొదట తేజ దర్శకత్వం వహించనున్నారు అనే వార్తలు వచ్చాయి.సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టారు.కానీ తర్వాత వివాదాల వల్ల తేజ తప్పుకున్నారు.

క్రిష్ దర్శకత్వం వహించారు.ఎన్టీఆర్ బయోపిక్ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత తేజ వివాదాలకు దూరంగానే ఉంటూ వచ్చారు.

ఎందుకు తప్పుకున్నారు అనేది ఎప్పుడు వెల్లడించలేదు.

అయితే సంక్రాంతికి ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ విడుదలైన తర్వాత ఈ సినిమాపై తేజ అభిప్రాయం తెలుసుకోవాలని మీడియా వారు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు.తన తాజా చిత్రం ‘సీత’ ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా తేజ మీడియా ప్రతినిధులకు ఎదురు పడ్డారు.బిజీగా ఉండటం వల్ల తాను ఎన్టీఆర్-కథానాయకుడు సినిమా ఇంకా చూడలేదని, ఒక వేళ చూసి ఉంటే మాట్లాడేవాన్ని అంటూ… తెలివిగా అందరి నోటికి తాళం వేశారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube