టీడీపీ లో ఇంటిపోరు ఇంతింతికాదాయ !

ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కి కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి.ఇప్పటికే అనేక సమస్యలతో విరామం లేకుండా కష్టపడుతున్న బాబుకి ఈ కొత్త పంచాయతీలు సరి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి.

 Inner Eligations In Tdp Party-TeluguStop.com

పార్టీకి చెందిన సీనియర్ నాయకులు దగ్గరి నుంచి ఈ సమస్య ఎక్కువగా వస్తుండడంతో….ఈ విషయంలో బాబు ఎలా ముందుకు వెళ్లాలో తెలియక సతమతం అవుతున్నాడు.

అయితే టిడిపిలో ఇప్పుడు నెలకొన్న ఈ పరిస్థితి గతంలో ఎప్పుడూ కనిపించలేదు.అసలు క్రమశిక్షణకు మారుపేరుగా టిడిపి పార్టీ ని చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దారు.

అయితే రాను రాను ఆ క్రమశిక్షణ కాస్త తగ్గిపోతూ వస్తున్నట్టు కనిపిస్తోంది.

ఏకంగా బెదిరింపులతో కూడిన వినతిని ఇచ్చే స్థితికి నాయకులు తయారయ్యారు.అసలు ఇప్పుడు టికెట్లు పంచే కీలక సమయం కావడంతో… నేతలంతా తమతో పాటు తాము సూచించిన వారు కూడా దక్కాలంటూ పట్టుబడుతున్నారు.ముఖ్యంగా తమ వారసులను రంగంలోకి దించాలని చూస్తున్నారు.

ఈ ఒక్క జిల్లాలోనే ఈ సమస్య తలెత్తితే ఫర్వాలేదు కానీ ప్రతి జిల్లాలోనూ ఇదే సమస్య టిడిపి సీనియర్ నాయకుల నుంచి బాబు ఎదుర్కొంటున్నాడు.పోనీ గట్టిగా ఈ విషయంపై మాట్లాడి నాయకులను హెచ్చరిద్దాం అంటే… వారంతా కాకలుతీరిన రాజకీయ ఉద్దండులే కాకుండా …మొదటి నుంచి టిడిపి లో బలమైన నాయకులుగా గుర్తింపు పొందిన వారే.

వారు కోరుతున్న కోరికల్లో ముఖ్యంగా సీట్ల కేటాయింపుల అంశాలే ఎక్కువగా ఉన్నాయి.ఈ ఎన్నికల్లో తమతో పాటు తమ వారసులకు కూడా టికెట్లు ఇవ్వాలంటూ దాదాపు పార్టీ సీనియర్ నాయకులు డిమాండ్లు పెడుతున్నారు.అంతే కాకుండా…కొన్ని కొన్ని చోట్ల సీట్ల విషయంలో కుటుంబ పంచాయతీలు పెరిగిపోయాయి.ఇవన్నీ పరిష్కరించాల్సిన బాధ్యత మొత్తం చంద్రబాబు మీదే పడింది.అందుకే వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరించి ఈ తలనొప్పులు తప్పించుకోవాలని బాబు చూస్తున్నాడు.అందుకే ఒక్కో సీనియర్ నేతను తన దగ్గరకు పిలిపించుకుని పరిస్థితిని వివరించి …వారికి అర్ధమయ్యేలా చెప్పి నచ్చజెప్పాలని చూస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube