ఈరోజుల్లో కంపెనీలు తమ ఎంప్లాయిస్ రోజూ ఆఫీస్‌కు రావాలని కోరుకుంటున్నాయి.అలానే సెలవులు ఇవ్వడానికి బాగా వెనకాడుతున్నాయి.
లీవ్ ఇచ్చే ముందు సరైన కారణం ఉందా లేదా అని అడిగి మరీ తెలుసుకుంటున్నాయి.ఇలా ఉద్యోగులు( employees ) తమకు సెలవులు ఎందుకు అవసరమో వివరించడం సర్వసాధారణం అయింది.
కానీ అన్ని కంపెనీల యజమానులు ఇంత కఠినంగా ఉండరు.పని పూర్తిగా చేస్తే కారణాలు లేకుండా హాలిడేలు తీసుకోవచ్చని చెబుతుంటారు.
ఫేమ్ అనే డిజిటల్ మార్కెటింగ్ సంస్థను నడుపుతున్న టామ్ హంట్( Tom Hunt ) కూడా సెలవు ఎందుకు కావాలని తన ఉద్యోగులను అస్సలు అడగడు.కారణం చెప్పాల్సిన అవసరం లేకుండా వారికి లీవ్స్ మంజూరు చేస్తానని తాజాగా చెప్పాడు.లింక్డ్‌ఇన్‌లో ఒక పోస్ట్ ద్వారా ఈ ఆలోచనలు పంచుకున్నాడు.ఒక కొత్త ఉద్యోగి తాను ప్లాన్ చేసుకున్న సెలవుదినం గురించి చెప్పినప్పుడు, ఎలాంటి వివరాలు అవసరం లేకుండా టామ్ దానిని ఆమోదించాడు.
అతను తన ఉద్యోగులు పనిని పూర్తి చేస్తారని విశ్వసిస్తాడు.
వ్యక్తిగత కారణాల వల్ల ఎవరైనా ఆలస్యం చేస్తారా లేదా త్వరగా వెళ్లిపోతారా అనేది తనకు తెలియాల్సిన అవసరం లేదని టామ్ పేర్కొన్నాడు.క్లయింట్లు సంతృప్తి చెందితే చాలు అని, సౌకర్యవంతమైన పనినే భవిష్యత్తుగా చూస్తానని చెప్తున్నాడు.అతని లింక్డ్‌ఇన్ పోస్ట్ ( LinkedIn post )చాలా మంది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది, దీనికి 86,000 మంది వ్యక్తులకు పైగా రియాక్ట్ అయ్యారు.
చాలా మంది టామ్ ఆలోచనలను మెచ్చుకున్నారు.ఉద్యోగులు ప్రతి నిమిషం ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడం కంటే విశ్వాసం ముఖ్యమని అన్నారు.అయితే, కొందరు టామ్ ఫాలో అవుతున్న పద్ధతి సరైంది కాదు అని అన్నారు.ఒక ఉద్యోగి తమ పనిని ఫినిష్ చేయకపోతే కంపెనీకి టైమ్, మనీ వేస్ట్ అవుతాయని అన్నారు.
ఎంప్లాయిస్‌కు కొన్ని నియమాలు, క్రమశిక్షణ అవసరమని వారు వాదించారు.