కొన్ని కొన్ని సార్లు సినిమా పరంగా కూడా కొన్ని సెంటిమెంట్లు అనేవి ఉంటాయి.అవి నటుల పరంగానే కాకుండా అభిమానుల నుండి కూడా సెంటిమెంట్లు ఉంటాయి.
తమ అభిమాన హీరో సినిమా విడుదలైంది అంటే చాలు కొన్ని సెంటిమెంట్లు పాటిస్తూ సినిమాకు వెళ్తారు.అలా నటీనటులు కూడా తమ సినిమా విషయంలో మంచి హిట్టు రావాలి అంటే కొన్ని సెంటిమెంట్లు పాటిస్తారు.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.మామూలుగా ఒక సినిమాకు సంబంధించిన ఏవైనా ఈవెంట్లలో ఎవరైనా ముఖ్యఅతిథిగా వస్తే వారికి బాగా ప్రాధాన్యత ఇస్తారు.ఎందుకంటే ఆ గెస్ట్ తోనే ఆ సినిమాకు సంబంధించిన కొన్ని విడుదల చేసే బాధ్యతలు అందిస్తారు.ఒకవేళ ఆ సినిమా సక్సెస్ అవుతే ఆ ముఖ్య అతిధిని మరో సినిమా ఫంక్షన్ కు కూడా పిలుస్తారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇలాంటివే జరుగుతున్నాయి.ఎందుకంటే ఆ ముఖ్య అతిధిని సెంటిమెంట్ గా భావిస్తారు.ఒకవేళ ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందో అది ఆ అతిథి రాక వల్లనేనేమో అని ఆందోళన పడుతుంటారు.చాలావరకు ఇటువంటివి ఇప్పటివరకు అతిథి రాక వల్ల అని అనుకోలేదు.
ఎందుకంటే తాము తీసిన సినిమాలు ప్రేక్షకులకు నచ్చనప్పుడు వచ్చిన అతిథి ఏం చేస్తాడు చెప్పండి.

ఎందుకంటే ఆ సినిమాలో తాను ఎటువంటి పాత్ర కూడా పోషించడు.కానీ ఆ అతిథి వల్లే అని సినీ ప్రముఖులు కాకున్నా చూసే ప్రేక్షకులు అనుకుంటారు.ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చింది ఓ అతిధికి.
ఇంతకు ఆ అతిథి ఎవరో కాదు అల్లు అర్జున్.ఈ పేరు వినగానే అందరు షాక్ అవ్వకుండా ఉండలేరు.
ఎందుకంటే అల్లు అర్జున్ ఒక స్టార్ హీరో.
పైగా మంచి సక్సెస్ లో ఉన్న హీరో.
అలాంటిది అల్లు అర్జున్ వల్ల ఓ సినిమా ప్లాప్ అని అంటున్నారు నెటిజన్లు.ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం.
అల్లు అర్జున్ చాలా వరకు సినీ ఈవెంట్ ఫంక్షన్ లలో యాక్టివ్ గా ఉంటాడు.అలా సినీ ప్రముఖులు కూడా అల్లు అర్జున్ ని ఆహ్వానించటానికి వెనుకాడరు.
అలా ఓసారి పడి పడి లేచే మనసు సినిమా ఈవెంట్ కు హాజరయ్యాడు.

కానీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.ఆ తర్వాత చావు కబురు చల్లగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కు హాజరయ్యాడు.కానీ ఆ సినిమా అస్సలు హిట్ కాలేదు.
ఇటీవలే పుష్పక విమానం, వరుడు కావలెను సినిమా ఈవెంట్ ఫంక్షన్ కు హాజరయ్యాడు.ఇక ఈ రెండు సినిమాలు కూడా బాగా ప్లాప్ అయ్యాయి.
ఇదిలా ఉంటే తాజాగా బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు పాల్గొన్నాడు.

అందులో ఆయన ఇచ్చిన స్పీచ్ అంతా ఇంతా కాదు.కానీ ఈసారి బాలయ్య అభిమానులు బాగా భయపడుతున్నారు.ఎందుకంటే అల్లు అర్జున్ వచ్చిన ప్రతి సినీ ఈవెంట్లలో ఆ సినిమాలు ప్లాప్ అవుతున్నాయని.
ఇప్పుడు బాలయ్య అఖండ సినిమా కూడా ప్లాప్ అవుతుందేమో అని అల్లు అర్జున్ పై బాగా ఫైర్ అవుతున్నారు.ఇక దీనిని ఒక మీమ్ ద్వారా క్రియేట్ చేశారు ఓ మీమర్.
ప్రస్తుతం ఈ మీమ్ నెట్టింట్లో వైరల్ గా మారింది.