అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిని కిరాతకంగా ఓ పోలీస్ ఆఫీసర్ హత్య చేసిన సంగతి తెలిసిందే.ఈ జాత్యంహకార ఘటన తర్వాత ఒక్కసారిగా ఆందోళనలు నిరసనలు అమెరికాలో ఎక్కువయ్యాయి.
వేల సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు.దేశం మొత్తం వ్యాపించిన నిరసనలు శ్వేత సౌధాన్ని కూడా తాకాయి.
వారి నిరసనలకు మధ్దతు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా హ్యాష్ ట్యాగ్స్ తో ట్రెండ్స్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు.ఇండియన్ రాజకీయనాయకులు, సెలబ్రిటీలు కూడా అమెరికాలో జరుగుతున్న నిరసనలకి తమ సంఘీభావం తెలుపుతున్నారు.
టాలీవుడ్ స్టార్స్ మహేష్ బాబు, అక్కినేని సమంత, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వారు బ్లాక్ కలర్ పోస్టులు పెట్టి తమ సంఘీభావం తెలిపారు.బాలీవుడ్ సెలబ్రిటీలు బ్లాక్ కలర్ పోస్ట్ లు పెట్టి వర్ణ వివక్షపై తమ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే ఈ విషయంలో స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ మాత్రం భిన్నంగా స్పందించింది.సోనమ్ మొదటి నుండి తన అభిప్రాయాలని నిర్మొహమాటంగా చెబుతుంది.అలాగే ఇండియాలో జరిగే కుల వివక్ష, మత వివక్ష మీద చాలా సందర్భాలలో తన అసహనం వ్యక్తం చేసింది.సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందించే జార్జ్ ఫ్లాయిడ్ మరణం పట్ల నిరసనలు తెలుపుతూ మదతు అడిగిన నెటిజన్లుకి కౌంటర్ వేసింది.
ఫస్ట్ నీ ఇల్లు నువ్వు శుభ్రం చేసుకో అని పోస్ట్ పెట్టింది.ఇండియాలో ఉన్న వర్ణ వివక్ష, జాతి వివక్ష లేకుండా చేసి తరువాత ఇతర దేశాలలో జరిగే ఘోరాలపై స్పందించాలని ఈ ఆమ్మడు తన ట్వీట్ ద్వారా వ్యక్తం చేసింది.
సోనమ్ కపూర్ ఉద్దేశ్యం మంచిదే అయిన ఆమె స్పందన పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సోనమ్ కపూర్ అవకాశవాది అని, హిపోక్రైట్ అని విమర్శలు చేస్తున్నారు.
మరికొంత ఆమె చేసిన కామెంట్స్ ని సమర్ధిస్తూస్తున్నారు.
.