ఈ మధ్య కాలంలో కొందరు తమ వైవాహిక జీవితంలో ఏర్పడినటువంటి అనుమానాలు కారణంగా పూర్తి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.తాజాగా ఓ వ్యక్తి తన భార్య పరాయి మగాళ్లతో మాట్లాడుతుందని ఏకంగా ఆమెపై కత్తితో దాడి చేసినటువంటి ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని అనంతపురం జిల్లా కి చెందిన గుంతకల్లు పరిసర ప్రాంతంలో “రజాక్” అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు.అయితే ఇతడు కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాడు.
అంతేకాకుండా అప్పుడప్పుడు కూరగాయలు అమ్మడం, కూలి పనులకు కూడా వెళ్లేవాడు.అయితే ఈ మధ్యకాలంలో రజాక్ భార్య షర్మిల స్థానికంగా ఉంటున్న యువకులతో కొంతమేర చనువుగా మాట్లాడుతోంది.
దీంతో రజాక్ తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు.అంతేకాకుండా ఈ మధ్యకాలంలో షర్మిలతో పలుమార్లు తాను ఇతర యువకులతో వివాహేతర సంబంధం పెట్టుకుందనే విషయంపై గొడవ పడేవాడు.
క్రమక్రమంగా ఈ గొడవలు రోజురోజుకీ ఎక్కువయ్యాయి.దీంతో షర్మిల తన కుటుంబ సభ్యులను పిలిపించి పోలీసులను ఆశ్రయించింది.దాంతో పోలీసులు మరోమారు ఈ విషయంపై గొడవకు పడకుండా సంతోషంగా ఉండాలని హెచ్చరించి పంపించే ప్రయత్నం చేశారు.అయినప్పటికీ రజాక్ మాత్రం తన భార్య పై ఉన్నటువంటి అనుమానం కారణంగా తన భార్య షర్మిల పరాయి వ్యక్తులతో మాట్లాడకుండా ఉంటానని ప్రామిసరీ నోటు పై రాసిస్తే అప్పుడే తన భార్యని కాపురానికి తీసుకెళ్తానని లేకపోతే విడాకులు ఇస్తానంటూ కండిషన్ పెట్టాడు.
దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.అంతేకాకుండా లేనిపోని అనుమానాలు కారణంగా పచ్చని కాపురం బుగ్గిపాలు చేసుకోవద్దని అంటూ రజాక్ కి కొంతమంది సూచిస్తున్నారు.