సముద్రాలలో ఎన్నో ప్రమాదకరమైన చేపలు ఉన్నాయి.వాటిలో కొన్ని ఎంత పెద్ద ఎర్రనైనా ఈజీగా చంపేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
ఇక కొన్ని చేపలు చూస్తేనే భయం కలిగించేలా, హారర్ సినిమాల్లోలాగా దేన్నైనా పిక్కొని తినేలా ఉంటాయి.వాటన్నిటిలో అత్యంత ప్రమాదకరమైన చేపగా బ్లోఫిష్ నిలుస్తోంది.
దీనిని పఫర్ ఫిష్( Power fish ) అని కూడా అంటారు.ఈ మాంసాహార చేప ఇతర చేపలకు, మానవులకు హాని కలిగించే ప్రాణాంతక విషాన్ని కలిగి ఉంటుంది.
అయితే, మొసళ్లను వేటాడే సామర్థ్యం ఉన్న కత్తుల వంటి పదునైన దంతాలతో మరొక భయంకరమైన చేప ఉంది.దానిని టైగర్ ఫిష్ అంటారు.ఆఫ్రికాలోని నదులు, సరస్సులలో కనిపించే టైగర్ ఫిష్( Tiger fish ) ఒక భయంకరమైన ప్రెడేటర్( predetar ).ఇది దాని పెద్ద, బాకు లాంటి దంతాలతో ఎరలను చాలా దారుణంగా వేటాడుతుంది.అంతేకాదు, అది కేవలం అర నిమిషంలో మొసలి ఎముకలను కరకర నమిలేయగలదు.
టైగర్ ఫిష్ కు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వైరల్ వీడియో ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది.దాని భయపెట్టే రూపం, హింసాత్మక స్వభావం కారణంగా దీనిని పిరాన్హా( Pirhana ) లేదా బార్రాకుడా అని కొందరు పొరపాటు పడ్డారు.
అయితే టైగర్ ఫిష్ ఈ జాతుల నుంచి భిన్నంగా ఉంటుంది.ఇది వేరే కుటుంబానికి చెందినది.ఇది చాలా దూకుడుగా ఉంది, ఇది నీటి ఉపరితలం దగ్గర పక్షులను పట్టుకుంటూ కనిపిస్తుంది.ఈ జాతికి శాస్త్రీయ నామం హైడ్రోసైనస్ గోలియత్.
పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి ఫిష్( Jalpaiguri fish of West Bengal ) మార్కెట్‌లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఓ విక్రేత 70 కిలోల టైగర్‌ఫిష్‌ను పట్టుకున్నాడు.బిహార్‌లోని గంగానది నుంచి సేకరించిన ఈ భారీ భారీ చేపను చూసేందుకు జనాలను ఎగబడ్డారు.దీనిని కిలోకు రూ.500 చొప్పున విక్రయించారు.ప్రపంచంలోని అత్యంత దూకుడు చేపలలో ఒకటిగా టైగర్ ఫిష్ ఖ్యాతి బాగా సంపాదించింది, ఇది క్రూరత్వంలో దక్షిణ అమెరికా పిరాన్హాతో పోటీపడుతుంది.