గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటిషన్( Governor Quota MLC Petition ) పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీ ఎన్నికపై స్టేటస్ కోను హైకోర్టు ఈ నెల 14వ తేదీ వరకు పొడిగించింది.
అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 14కు వాయిదా వేసింది.అయితే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్( Congress Govt ) గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండ రాం, అమీర్ అలీఖాన్ లను నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.
వీరిని గవర్నర్ ఎమ్మెల్సీగా ప్రకటించారు.
కానీ గత ప్రభుత్వంలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను నామినేట్ చేయగా గవర్నర్ ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన సంగతి తెలిసిందే.దీనిపై దాసోజు శ్రవణ్( Dasoju Sravan ) కోర్టును ఆశ్రయించగా.విచారణ చేపట్టిన ధర్మాసనం గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారాన్ని తాత్కాలికంగా నిలిపి వేయాలని స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది.
తాజాగా ఈ స్టేటస్ కో ఉత్తర్వులను ఈనెల 14 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.