రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District )పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిధిలో ఉన్న పెట్రోల్ బంక్ యజమానులు, నిర్వహకులతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా ఎస్పీ .ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…పలు సందర్భాల్లో ప్లాస్టిక్ బాటల్స్ లేదా క్యాన్ లలో పెట్రోల్ కొనుక్కొని కొంతమంది నేరస్తులు పలురకాల నేరాలకు పాల్పడుతున్నారని, జిల్లాలో గల పెట్రోల్ బంక్ యజమానులు ఎవరు కూడా పెట్రోలియం యాక్ట్ 2002 ప్రకారం పెట్రోల్ ను ప్లాస్టిక్ బాటల్స్ లేదా క్యాన్ లలో పోయావద్దని సూచించారు.
ఎవరైనా పై చట్టాన్ని ఉల్లంగించి, బాటల్స్ లేదా క్యాన్ లలో పెట్రోల్ పోసినట్లైతే అట్టి పెట్రోల్ బంక్ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు పెట్రోల్ బంక్ లైసెన్స్ రద్దుకు సిఫారసు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ( SP Akhil Mahajan ) హెచ్చరించారు.పెట్రోల్ బంక్ లకు నిత్యం వాహనదారులు పెట్రోల్ నిమిత్తం ఎక్కువ సంఖ్యలో వస్తుంటారని అందువలన పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద జిల్లాలో ఉన్న ప్రతి పెట్రోల్ బంక్ లలో హై రెజల్యూషన్, నైట్ విజన్ కలిగిన సి.సి.టి.వి.కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తద్వారా నేరాలను నియత్రించవచ్చని, నేరస్తులను,ఏదైనా ప్రమాదాలు, సంఘటనలు జరిగినా త్వరగా గుర్తించవచ్చన్నారు.పెట్రోల్ బంక్ లలో ఫైర్ సేఫ్టీ కి సంబంధించిన నిబంధనలు తప్పకుండా పాటించాలి.సబ్ డివిసినల్ అధికారులు, ఇన్స్పెక్టర్ లు,ఎస్.ఐ లు ప్రతి మూడు నెలలకొకసరి తనిఖీలు నిర్వహిస్తారని పై నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు.
ప్రతి ఒక్కరూ హెల్మెట్( Helmet ) ధరించాలనే నిబంధనలను కఠినతరం చేయడానికి నో హెల్మెట్ నో పెట్రోల్ నినాదంతో జిల్లా పోలీస్ శాఖ ముందస్తుగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతమన్నారు.
పెట్రోల్ బంక్ యజమానులు బంకులో పనిచేసే సిబ్బందితో సమావేశమై హెల్మెట్ లేకుండా పెట్రోల్ కోసం వచ్చిన వాహనదారులకు హెల్మెట్ లేనిదే పెట్రోల్ పోయారాదని ప్రతి వాహనదారుడుకి అవగాహన కల్పించాలన్నారు.రోడ్ సేఫ్టీ విలేజ్ కమిటీ లో భాగంగా జిల్లా ప్రధాన రహదారుల వెంబడి ఉన్న పెట్రోల్ బంక్( Petrol Bunk ) లలో పని చేసే సిబ్బంది కి మొదటి దశలో సిపిఆర్ , ప్రథమ చికిత్స పై శిక్షణ ఇవ్వడం జరిగిందని, రెండవ దశలో లో మళ్ళీ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, తద్వారా రహదారుల వెంబడి ప్రమాదాలు జరిగిన సమయాల్లో ప్రాణాలు కాపాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయని అన్నారు.
ఎస్పీ గ వెంబడి డిఎస్పీ లు ఉదయ్ రెడ్డి, నాగేంద్రచరి, టౌన్ సి.ఐ రఘుపతి,జిల్లాలోని పెట్రోల్ బంక్ యజమానులు పాల్గొన్నారు.