అమెరికన్ రాజకీయాల్లో కలకలం రేగింది.అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం పోటీపడిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత సంతతికి చెందిన బిలియనీర్ వివేక్ రామస్వామి( Vivek Ramaswamy )లు మార్ ఏ లాగో రిసార్ట్‌లో తళుక్కుమన్నారు.ట్రంప్‌కు ఈ నెలలో విచిత్ర ఘటనలు ఎదురవుతున్నాయి.2024 ప్రెసిడెన్షియల్ క్యాంపెయినింగ్‌కు సంబంధించి అయోవా, న్యూహాంప్‌షైర్, నెవాడాలలో ప్రాథమిక విజయాల నుంచి జనవరి 6 ఘటనపై సుప్రీంకోర్టు విచారణ వరకు ట్రంప్‌కు పరస్పర విరుద్ధ ఘటనలు ఫేస్ చేస్తున్నారు.
మార్ ఏ లాగోలో జరిగిన ‘‘ మెగా మాగా’’ (మేక్ అమెరిక్ గ్రేట్ ఎగైన్) కార్యక్రమానికి ట్రంప్ సతీమణి, మాజీ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ( Melania )హాజరయ్యారు.అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటి వరకు ట్రంప్‌ను ప్రమోట్ చేసేలా మెలానియా ఎలాంటి కార్యక్రమానికి హాజరుకాలేదు.అలాంటిది మార్ ఏ లాగ్‌కు ఆమె రావడం రిపబ్లికన్ పార్టీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది.అలాంటిది వివేక్ రామస్వామి , అతని సతీమణి అపూర్వ టీ రామస్వామి ట్రంప్ కుటుంబంతో కలివిడిగా వుండటంపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
కాగా.తొలుత ట్రంప్( Donald Trump )కు పోటీనిచ్చే స్థాయిలో దూసుకొచ్చిన వివేక్.అనూహ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోంచి గత నెలలో తప్పుకున్న సంగతి తెలిసిందే.రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిత్వానికి సంబంధించి ఇటీవలి అయోవా ప్రైమరీలో ఎలాంటి ప్రభావం చూపించని నేపథ్యంలో వివేక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
డొనాల్డ్ ట్రంప్‌కు తన మద్ధతు వుంటుందని రామస్వామి వెల్లడించారు.తాము అనుకున్న విధంగా ఫలితాలు రాలేదని, ఈ క్రమంలో ప్రచారాన్ని నిలిపివేస్తున్నామని, అమెరికా అధ్యక్షుడిగా వుండేందుకు తనకు మార్గం లేదని వివేక్ తెలిపారు.
తాజా పరిణామాల నేపథ్యంలో ట్రంప్ తన వైస్ ప్రెసిడెంట్‌గా వివేక్ రామస్వామిని ఎంచుకుంటారా అన్న చర్చ జరుగుతోంది.మరి మార్ ఏ లాగోలో వీరిద్దరి కలయిక దేనికి సంకేతమన్నది త్వరలోనే తెలియనుంది.
ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించకుంటే మాత్రం .మీడియా, సోషల్ మీడియాలో ఊహాగానాలకు తెరపడవు.