యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు గాయం అయినట్టుగా తెలుస్తుంది.జిమ్ లో వ్యాయామాలు చేస్తూ ఉండగా కుడి చేతికి గాయం అయ్యిందట.
దీంతో వైద్యులు ఆయనకు సర్జరీ చేసినట్టు తెలుస్తుంది.ఎన్టీఆర్ దీపావళి సందర్భంగా షేర్ చేసిన ఫోటో ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది.
నిన్న దీపావళి సందర్భంగా సెలెబ్రిటీలు కూడా ఈ పండుగను గ్రాండ్ గా జరుపుకోవడమే కాకుండా ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సందడి వాతావరణం నెలకొంది.
ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన కుమారులతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
ఈ ఫోటోను పరీక్షగా చుస్తే ఈ గాయం విషయం అర్ధం అవుతుంది.ఆయన కుడి చేతికి బ్యాండేజ్ వేసుకుని కనిపించారు.ఆయన ఇటీవల తన ఇంట్లో జిమ్ లో వ్యాయామాలు చేస్తున్న సమయంలో తారక్ కుడి చేతికి గాయం అయ్యిందట.చేతి వేలుకు గాయం అవ్వడంతో నాలుగు రోజుల క్రితం వైద్యులు ఆయనకు సర్జరీ చేసినట్టు సమాచారం.
ప్రెసెంట్ ఎన్టీఆర్ ఆరోగ్యంగా బాగానే ఉందట.కాకపోతే కొన్ని రోజులు మాత్రం బెడ్ రెస్ట్ అవసరం అని వైద్యులు తెలిపారని సమాచారం.అందుకే ఎన్టీఆర్ మరొక నెల రోజుల పాటు రెస్ట్ తీసుకుని అప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా ను సెట్స్ మీదకు తీసుకు వెళ్లనున్నాడట.ఈ వార్త విన్న నందమూరి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

ఇక ప్రెసెంట్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమాలో తారక్ కొమరం భీం పాత్రలో కనిపించనున్నాడు.ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా 7వ తేదీన విడుదల కాబోతుంది.