పవన్ అభిమానులతో ముచ్చటించిన హరీష్ శంకర్.. దిమ్మతిరిగేలా కౌంటర్లు?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) డైరెక్టర్ హరీష్ శంకర్ ( Harish Shankar ) కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ( Ustad Bhagat Singh ). గబ్బర్ సింగ్ ( Gabbar Singh ) సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

 Harish Shankar Debate With Pawan Kalyan Fans On Ustaad Bhagat Singh, Harish Shan-TeluguStop.com

అయితే ఈ సినిమా విషయంలో డైరెక్టర్ హరీష్ శంకర్ అలాగే పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య డిబేట్ నడుస్తూనే ఉంది.కాగా మొదట్లో ఈ సినిమా తమిళ్ తేరి సినిమాకి రీమేక్ అని, ఆ తరువాత షూటింగ్ మొదలు పెట్టి ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేస్తే ఆ ఫొటోలో ఉన్నది పవన్ కాదు హరీష్ శంకర్ అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేయగా, అది భీమ్లా( Bheemla ) సెట్ లోని ఫోటో అంటూ కామెంట్స్ మొదలయ్యాయి.దీంతో ఒక అభిమాని ఈ విషయం గురించి హరీష్ శంకర్ ని ప్రశ్నించాడు.బొట్టు వెనుక విషయం ఏమిటి హరీష్ గారు అని ప్రశ్నించగా.హరీష్ స్పందిస్తూ.మీరు కూడా బొట్టు గురించి అడిగితే ఎలా మూర్తి గారు? అది మన సంప్రదాయం ఎవరన్నా పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, రోజు పెట్టుకోవచ్చు.మిగతా విషయం వెండితెర మీద చూడండి అని కూల్ గా సమాధానం ఇచ్చాడు.

వెంటనే అభిమాని స్పందిస్తూ.పెట్టుకోవడం పెట్టుకోకపోవడం గురించి కాదు శంకర్ జీ.

ఇక్కడ విషయం మీద క్యూరియాసిటీతో అడిగాను అంటూ రిప్లై ఇవ్వగా.హరీష్ శంకర్ స్పందిస్తూ.పోస్టర్స్ వేసేది క్యూరియాసిటీ పెంచడం కోసం. థాంక్యూ ఫర్ యువర్ క్యూరియాసిటీ ( Thank you for your curiosity ) అంటూ ట్వీట్ చేశాడు.

ఇలా వరుసగా అభిమానులు ప్రశ్నలు అడగగా హరిశంకర్ వారికి నెమ్మదిగా నవ్వుతూ సమాధానాలు ఇస్తూనే చురకలు అంటించాడు.ఇంతలో మరో అభిమాని క్యూరియాసిటీ పెంచడం వరకు ఓకె అండీ.

కానీ భీమ్లా భీమ్లా అంటున్నారు ఫ్యాన్స్.మరి దానికి కూడా సమాధానం ఇవ్వండి అని అడగగా.

హరీష్ స్పందిస్తూ కామెంట్లదీ ఏముంది లెండీ మొన్న ఫస్ట్ పోస్టర్ లో ఉన్నది నేనే అన్నారు.ఆ కామెంట్లు చూసి నేను పవన్ కళ్యాణ్ గారు అందరు నవ్వుకున్నాము.

కామెంట్లని పట్టించుకుంటే సినిమాలు ఎలా తీస్తామండీ.ఇంకా నయం హీరో గారిని కూడా భీమ్లా సినిమాలో హీరో గారిని పెట్టారు అనలేదు అంటూ రిప్లై ఇచ్చాడు.

ఇంతలో మరొక అభిమాని.అంటే మీరు ఫ్యాన్స్ మనోభావాలు, అభిప్రాయాలు పట్టించుకోరా? పరిగణనలోకి తీసుకోరా? అని ప్రశ్నించాడు.దానికి హరీష్ రియాక్ట్ అవుతూ.నేను కూడా అభిమానులలో ఒకడ్నే అండీ.కాకపోతే ట్విట్టర్( Twitter ) లో కామెంట్స్ చేసేవాళ్ళంతా ఫాన్స్ అనుకోవడం పొరపాటు అంటూ రిప్లై ఇచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube