ఒక్కో మనిషికి ఒక్కో పిచ్చిఒకరికి సినిమాల పిచ్చి ఉంటే మరొకరికి పాటల పిచ్చి.అలాగే మనం తెలుసుకోబోయే వ్యక్తికి టాటూల పిచ్చి అన్నమాట.
ఆ పిచ్చి పరాకాష్టకు చేరితే ఎలా ఉంటుందో ఇతన్ని చూస్తే అర్ధం అవుతుంది.టాటూ గురించి మీ అందరికి తెలిసిందే.
మన శరీరం మీద పుట్టుమచ్చ ఎలాగో టాటూ కూడా అంతే.మనకి నచ్చిన వారి పేర్లనుగాని లేదంటే దేవుడి బొమ్మలను, పువ్వులను టాటూ రూపంలో శరీరంలో మనకి నచ్చిన చోట వేయించుకుంటాము.
అలా టాటూలు వేయించుకోవడం అనేది ప్రస్తుత ట్రెండ్.కానీ ఇతను మాత్రం కాస్త వెరైటీ అన్నమాట.
ఎవరన్నా తమకి నచ్చిన వారి సంతకాలను ఏదన్నా బుక్ లో ఆటో గ్రాఫ్ లాగా తీసుకుంటారు కదా.కానీ ఇతను మాత్రం ఏకంగా తనకి నచ్చిన వారందరి సంతకాలను వాళ్ళ చేతే టాటూలుగా తన వీపు మీద వేయించుకుంటున్నాడు.ఇలా ఇప్పటిదాకా అతను 225 మంది సంతకాలను ఇలా వీపు మీద వేయించుకుని ఒక సరికొత్త రికార్డ్ సృష్టించాడు.అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనే వివరాలు చూద్దామా.
అతని పేరు ఫంకీ మటాస్.వినడానికి కొత్తగా ఉంది కదా.అయితే ఇది అతను అసలు పేరు కాదు.అతను పెట్టుకున్న పేరు అన్నమాట.
నిజానికి అతని అసలు పేరు మాత్రం జూన్ మటాస్.ఈ వ్యక్తి ఫ్లోరిడాలో నివసిస్తూ ఉంటాడు.
ఇతనికి టాటూలు వేయడం అనేది ఒక హాబీ.దానిని కాస్త వృత్తిలాగా మార్చుకున్నాడు.
ఈ క్రమంలోనే మటాస్ కు కొత్తగా ఏదైనా చేయాలనిపించి తనకు ఇష్టమైన స్నేహితుల పేర్లను టాటూల రూపంలో తన వీపు పై సంతకాల రూపంలో చేయమని అడిగాదట.అలా స్నేహితుల తరువాత తన ఫ్యామిలీ మెంబెర్స్ సంతకాలను కూడా చేయించుకున్నాడు.
అలాగే తనకి నచ్చిన సెలెబ్రిటీలు ఎక్కడ షూటింగ్ చేస్తుంటే అక్కడికి వెళ్లి మరి అతని వీపు చూపిస్తూ సంతకాలు చేయని ప్రాధేయపడేవాడట.అతడి గోల భరించలేక చాలా మంది అమెరికా టీవీ స్టార్లు, సినిమా నటి నటులు కూడా సంతకాలు చేసేవారట.

ఈ విషయంపై మటాస్ చెబుతూ నా వీపుపై ఎవరి సంతకం ఉందో వారు నాకు ఏదో కొన్ని కొన్ని విషయాల్లో స్పూర్తిదాయకంగా నిలిచిన వారై ఉంటారు’ అని చెబుతున్నాడు మటాస్.ఇప్పటికి అతనివీపుపై 225 మంది సంతకాలు ఉన్నాయి.ఇలా వీపుపై అత్యధిక టాటూ సంతకాలు కలిగిన వ్యక్తిగా మటాస్ గిన్నిస్ వరల్డ్ బుక్ లో చోటు సంపాదించుకున్నాడు.అలాగే తన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటాడు.
హాలీవుడ్ లో గల సూపర్ స్టార్స్ తో సంతకాలు చేయించుకోవాలని మటాస్ కోరుకుంటున్నాడట.రానున్న రోజుల్లో 225 సంతకాలు కాస్త 300 మంది సంతకాలు అయ్యేలా ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.