బీఆర్ఎస్ పదేళ్లలో ఉద్యోగ నియామకాలు ఎందుకు చేయలేకపోయారని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ప్రశ్నించారు.ఉద్యోగాలు భర్తీ చేయడానికి బీఆర్ఎస్ కు సమయం దొరకలేదని పేర్కొన్నారు.
దోచుకున్నది దాచుకోవడంపైనే బీఆర్ఎస్ దృష్టి పెట్టిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఉద్యోగాల భర్తీపై దృష్టిపెట్టామన్నారు.
కాంగ్రెస్ సర్కార్ వచ్చిన 70 రోజుల్లోనే 25 వేల పోస్టులను భర్తీ చేసిందని చెప్పారు.
పోలీస్, ఎక్సైజ్, ఫైర్ శాఖల్లో 13,444 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టామని తెలిపారు.త్వరలోనే గ్రూప్-1 పరీక్షలు( Group-1 exams ) నిర్వహిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే గ్రూప్ -4 ఫలితాలు విడుదల చేశామని వెల్లడించారు.567 గ్రూప్ -1 పోస్టులకు సంబంధించి అనుమతి ఇచ్చామని తెలిపారు.
.