Group-1 Exams : త్వరలోనే గ్రూప్-1 పరీక్షలు..: సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ పదేళ్లలో ఉద్యోగ నియామకాలు ఎందుకు చేయలేకపోయారని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ప్రశ్నించారు.

ఉద్యోగాలు భర్తీ చేయడానికి బీఆర్ఎస్ కు సమయం దొరకలేదని పేర్కొన్నారు.దోచుకున్నది దాచుకోవడంపైనే బీఆర్ఎస్ దృష్టి పెట్టిందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఉద్యోగాల భర్తీపై దృష్టిపెట్టామన్నారు.కాంగ్రెస్ సర్కార్ వచ్చిన 70 రోజుల్లోనే 25 వేల పోస్టులను భర్తీ చేసిందని చెప్పారు.

"""/" / పోలీస్, ఎక్సైజ్, ఫైర్ శాఖల్లో 13,444 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టామని తెలిపారు.

త్వరలోనే గ్రూప్-1 పరీక్షలు( Group-1 Exams ) నిర్వహిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే గ్రూప్ -4 ఫలితాలు విడుదల చేశామని వెల్లడించారు.

567 గ్రూప్ -1 పోస్టులకు సంబంధించి అనుమతి ఇచ్చామని తెలిపారు.