రాబంధువులు కూడా ఇంత దారుణంగా ప్రవర్తించవేమో.వాటి కడుపు నిండగానే ఆ మాంసాన్ని వదిలేస్తాయి.
కానీ మనిషి అని చెప్పుకుంటున్న జీవికి మాత్రం ఎంతగా దోచుకున్న దనదాహం ఆగదు.అందుకు నిదర్శనం కరోనా సమయంలో ప్రైవేట్ ఆస్పత్రులను చెప్పవచ్చూ.
అత్యవసరం అయితేనే లక్షల్లో బిల్లులు వసూలు చేయని ఆస్పత్రులు, ఈ కరోనా వల్ల మినిమం మూడు నుండి నాలుగు లక్షల బిల్లు వసూల్ చేయనిదే కోవిడ్ పేషెంట్స్ కు వైద్యం అందించడం లేదు.
బ్రతకాలనుకుంటే తన దగ్గర ఉన్నవి అన్నీ అమ్మవలసిందే.
అయినా బ్రతుకుతామనే నమ్మకం లేదు.ఇలాంటి క్లిష్టపరిస్దితుల్లో వైద్యం విషయంలో ప్రభుత్వాల వైఫల్యం సృష్టంగా కనిపిస్తుందని అంటున్నారు.
ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో లేటుగా కళ్లు తెరచిన ప్రైవేట్ దవఖానాల మీద గట్టిగానే ఫోకస్ చేసింది.రాష్ట్ర వ్యాప్తంగా కరోనా రోగుల నుండి అధికంగా ఫీజులు గుంజుతున్న 88 ప్రైవేట్ ఆస్పత్రుల పై ఫిర్యాదులు అందడంతో ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లుగా వెల్లడించింది.
అదీగాక ఇలాంటి వాటి విషయంలో ఫిర్యాదు చేయాలనుకుంటే 91541 70960 నంబర్‌ను సంప్రదించాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు తెలియచేశారు.