యాసిడ్ దాడి అనగానే అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలు మనకు గుర్తుకువస్తాయి.కానీ అస్తమానం అమ్మాయిలపైనే కాకుండా అబ్బాయిలపై జరిగే అఘాయిత్యాలు కూడా అప్పుడప్పుడు మనంచూస్తున్నాం.
తాజాగా జరిగిన ఓ యాసిడ్ దాడి కూడా ఇలాంటి కోవకు సంబంధించింది.ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ ప్రేమికురాలు తన ప్రేమికుడిపై యాసిడ్ దాడికి పాల్పడింది.
దీనికిగల కారణం తెలుసుకుని పోలీసులు ముక్కున వేలేసుకున్నారు.
ఉన్నావ్ జిల్లా భవానీగంజ్‌కు చెందిన తాయిబా అహ్మద్(20), రోహిత్ యాదవ్(25)లు ఎదురెదురు ఇళ్లలో ఉంటున్నారు.
వీరిద్దరు గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.కాగా రోహిత్ ఆమెను ఇటీవల కలవడం లేదని, ఆమె కోపంతో ఊగిపోయింది.
అంతటితో ఆగకుండా రోహిత్‌ను మంగళవారం అర్ధరాత్రి ఆమె గొడవు దిగింది.అంతేగాక అతడిపై యాసిడ్ దాడికి పాల్పడింది.
కాగా తనను ప్రేమ పేరుతో వేధించాడని అతడిపై యాసిడ్ దాడికి పాల్పడ్డానని చెప్పిన ఆమె, పోలీసుల విచారణలో అసలు నిజం చెప్పింది.
రోహిత్‌కు 20 శాతం గాయాలైనట్లు తెలుస్తోంది.
కాగా తాయిబాపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.ఏదేమైనా బాయ్‌ఫ్రెండ్ తనతో మాట్లాడటం లేదనే కోపంతో అతడిపై యాసిడ్ పోసిన తాయిబా ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.