దేశ రాజధాని ఢిల్లీ లో ఎన్నికలు దగ్గర పడుతుండడం తో ప్రధాన పార్టీలు ప్రచారం లో మునిగిపోయాయి.అధికార,ప్రతిపక్షాలు ఒకరిపై నొకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారం కొనసాగిస్తున్నారు.
అయితే ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేస్తున్న మనీష్ సిపోడియా బైక్ ర్యాలీ లో పాల్గొన్నారు.అయితే ఆయన హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోయారు.
దీనితో ఈ అంశాన్ని అవకాశంగా తీసుకున్న బీజేపీ నేతలు జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.ఢిల్లీ లోని పట్ పడ్ గంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆప్ నేత మనీశ్ సిపోడియా ఆ నియోజకవర్గం లో బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ క్రమంలో ఆయన హెల్మెట్ పెట్టుకోవడం మరిచిపోయారు.అయితే దీనిని గమనించిన బీజేపీ నేతలు ఈ ఉదంతం పై జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి, వాహనం నడిపిన సిసోడియాపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే సిసోడియాతో పాటు ర్యాలీలో పాల్గొన్న వారందరూ కూడా హెల్మెట్ ధరించలేదని, వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ నేధ్యంలో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు సిసోడియాకు వెయ్యి రూపాయల మేరకు చలానా విధించినట్లు తెలుస్తుంది.ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు అందడం తో నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
జనవరి 30 మధ్యాహ్నం లోపు కేంద్రమంత్రి వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసుల్లో పేర్కొంది.