అఖిల్ ఇంటికి వచ్చిన గంగవ్వ.. కొడుకు పై షాకింగ్ కామెంట్స్..!

గంగవ్వ ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.యూట్యూబ్ లో ప్రసారం అయ్యే మై విలేజ్ షో ద్వారా గంగవ్వ కొంత పాపులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే.

 Gangavva Visits Akhil House And Made Shocking Comments On Her Son , Gangavva, B-TeluguStop.com

కానీ.ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 4లో గంగవ్వ కూడా ఒక కంటెస్టెంట్ గా పాల్గొనడం వలన ఆమెకు విపరీతమైన క్రెజ్ వచ్చింది అనే చెప్పాలి.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు గంగవ్వ ఎక్కువగా అఖిల్ తో క్లోజ్ గా ఉండేది.అఖిల్ అంటే నాకు కొడుకుతో సమానం అని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది గంగవ్వ.

అలాగే అఖిల్ కూడా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ కి గట్టి పోటీనే ఇచ్చాడని చెప్పాలి.బిగ్ బాస్ తరువాత అఖిల్ సార్ధక్ కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నారు.

అలాగే అఖిల్ కు కూడా గంగవ్వ అంటే అభిమానం.అందుకే వీరి ఇద్దరి మధ్య ఉన్న మదర్ అండ్ సన్ బండింగ్ ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

ఇక ఇటీవల గంగవ్వ ఒక వీడియోలో అఖిల్ గురించి మాట్లాడిన విధానం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.అలాగే గంగవ్వ కొత్త ఇల్లు నిర్మాణం ఆల్ మోస్ట్ పూర్తయ్యింది.

బిగ్ బాస్ ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ తో పాటు నాగార్జున ఇచ్చిన డబ్బుతో ఆమె కొత్త ఇంటిని నిర్మించుకుంటోంది.అయితే ఇటీవల గంగవ్వ ఉన్నటుండి అఖిల్ ఇంటి ముందు ప్రత్యక్షమయ్యింది.

గంగవ్వ దాదాపు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లలో అందరి ఇంటికి వెళ్లి వచ్చింది.ఇప్పుడు గంగవ్వ మొదటిసారి అఖిల్ వద్దకు వెళ్లి అతని కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపారు.

అయితే అఖిల్ సెల్ఫీ విడియో షూట్ చేయగా అందులో ఆమె కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు.గంగవ్వ తన కొడుకు గురించిన మాటలు హాట్ టాపిక్ గా మారాయి.

అయితే గంగవ్వ నవ్వుతూనే సరదాగా మాట్లాడడం వలన సరదాగా చెప్పి ఉండొచ్చని కామెంట్స్ వస్తున్నాయి.అఖిల్ అంటే నా కొడుకుతో సమానం.వాళ్ళ ఇంట్లో వాళ్ళను ఒప్పించి మా ఇంటికి తీసుకపోవాలని అనుకుంటున్నా అని అన్నది.అలాగే నా కొడుకు నన్ను చూసుకునేలా లేడు.

అందుకే అఖిల్ ను తీసుకుని వెళ్తాను అన్నట్లు మాట్లాడింది.కొత్త కారులో వచ్చాను.

అఖిల్ ను అందులో ఇంటికి తీసుకువెళతాను అని గంగవ్వ నవ్వుకుంటూ వివరణ ఇచ్చింది.ఇప్పుడు ఈ అమ్మ కొడుకులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube