వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది.ఈ మేరకు గులాబీ పార్టీకి రాజీనామా చేసిన ఆయన ఇవాళ బీజేపీ గూటికి చేరారు.
ఈ క్రమంలో ఆయనకు బీజేపీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
అయితే తొలుత ఆరూరి పార్టీ మారుతారనే ప్రచారం జరగగా గులాబీ బాస్ కేసీఆర్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
కానీ కేసీఆర్ బుజ్జగింపులు ఫలించలేదు.ఈ క్రమంలోనే ఆయన కాషాయతీర్థం పుచ్చుకున్నారు.
కాగా ఆరూరి వరంగల్ పార్లమెంట్ సీటును ఆశిస్తున్నారని తెలుస్తోంది.ఇప్పటికే అమిత్ షాతో చర్చించి సీటు విషయంపై స్పష్టమైన హామీ తీసుకున్నారని సమాచారం.
అయితే తెలంగాణలో ఖమ్మంతో పాటు వరంగల్ స్థానాలను బీజేపీ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఎస్సీ రిజర్వ్ డ్ స్థానంగా ఉన్న వరంగల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆరూరి పోటీలో ఉండే అవకాశం ఉంది.