బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్( Former CM KCR ) ను మాజీ మంత్రి మల్లారెడ్డి( Former Minister Mallareddy ) కలిశారు.కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారంతో మల్లారెడ్డిని పిలిపించిన కేసీఆర్ ఆయనతో మాట్లాడారు.
ఈ క్రమంలోనే మల్లారెడ్డి తాను పార్టీ మారడం లేదని చెప్పారని తెలుస్తోంది.అలాగే బీఆర్ఎస్ ఎంపీ టికెట్ తమ కుటుంబ సభ్యులకు వద్దని మల్లారెడ్డి తెలిపారని సమాచారం.
అయితే నిన్న సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో మల్లారెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే.దీంతో మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ( Marri Rajasekhar Reddy )బీఆర్ఎస్ ను వీడి త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ క్రమంలో కేసీఆర్ మల్లారెడ్డిని పిలిపించి మాట్లాడారు.సీఎం సలహాదారును కాలేజీ భవనాల కూల్చివేత అంశంపై కలిసినట్లు స్పష్టం చేసిన మల్లారెడ్డి పార్టీ మారడం లేదని వెల్లడించారు.