ట్రంప్ కోడలికి ఫేస్ బుక్ వార్నింగ్...ఇంతకి దిగజారావా ట్రంపూ...!!

మాస్ తో పెట్టుకుంటే మడతడిపోద్ది అన్నట్టుగా ఫేస్ బుక్ తో పెట్టుకుంటే కూడా మడత పడుద్ది అంటూ ట్రంప్ కు చుక్కలు చూపిస్తోంది ఈ సామాజిక మాధ్యమం.ఒక్క సారి ఫేస్ బుక్ లొల్లి అయిన తరువాత, మెడ పట్టుకుని బయటకు గెంటేసిన తరువాత ఎలాంటి తోపు అయినా సరే నో ఎంట్రీ అంటోంది.

 Facebook Removes Video Of Trump Interview With Daughter-in-law Lara, Facebook, T-TeluguStop.com

అంతేకాదు ఫేస్ బుక్ హిట్ లిస్టు లో ఉన్న వాళ్ళ వీడియోలు, ఫోటో లు ఎవరు షేర్ చేసినా సరే వారిని కూడా బ్లాక్ లిస్టు లో పెట్టడానికి వెనుకాడమని తేల్చి చెప్తోంది.ఈ మేరకు ట్రంప్ కోడలికి ఫేస్ బుక్ హెచ్చరికలు కూడా జారీ చేసింది.

క్యాపిటల్ భవనం పై దాడి ఘటన కారణంగా ట్రంప్ ఖాతాను శాశ్వతంగా తొలగించిన ఫేస్ బుక్.అసలు ట్రంప్ కు మరో అవకాశం ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసింది.

నిషేధం ఎత్తేసే ఆలోచన అనేది కూడా మాకు రాదని బల్లగుద్ది మరీ చెప్పింది.అంతేకాదు ట్రంప్ ఏ విధంగానైనా ఫేస్ బుక్ వాడుకోవాలని చూసినా అన్ని ప్రయత్నాలను తిప్పి కొడుతోంది.

ట్రంప్ పై బ్యాన్ విధించిన నాటి మొదలు ఎన్నో సార్లు వేరే వ్యక్తుల ద్వారా ఫేస్ బుక్ వాడుకోవాలని విశ్వప్రయత్నాలు చేశారు.కానీ

Telugu Donald Trump, Bans Trump, Trumpinterview, Lara, Trump Law-Telugu NRI

ఫేస్ బుక్ మాత్రం డేగ కళ్ళతో ట్రంప్ చర్యలను గుర్తిస్తూ అడ్డు పడుతోంది.కొన్ని రోజుల క్రితం ఇద్దరు వ్యక్తుల ఫేస్ బుక్ ఖాతాల ద్వారా తనకు సంభందించిన కొన్ని ఫోటోలను ఫేస్ బుక్ లో షేర్ చేయగా వాటిని తొలగించింది.తాజాగా ట్రంప్ తన కోడలు లారా ఫేస్ బుక్ ఖాతా నుంచీ లైవ్ వీడియో తో పాటు ఓ వీడియో ను పోస్ట్ చేశారు ట్రంప్.

ఇలా పోస్ట్ చేశారో లేదో వెంటనే ఫేస్ బుక్ నుంచే ఆమెకు ఈ మెయిల్ వచ్చింది.ఈ వీడియో లో ట్రంప్ వాయిస్ ఉందని, అందుకే మేము ఈ వీడియో తొలగిస్తున్నామని తెలిపింది.

ఇలాంటి చర్యలు ఇంకొకసారి చేపడితే మీపై కూడా ఆంక్షలు విధించాల్సి వస్తుందని హెచ్చరించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube