కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా.. ప్రతిరోజు ఇలా చేయండి..!

సాధారణంగా ఈ మధ్య కాలంలో అనారోగ్యకరమైన జీవన శైలి కారణంగా చాలామంది కిడ్నీ సంబంధిత సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు.దీని వల్ల అనేక ఇతర వ్యాధులతో కూడా వారు బాధపడుతున్నారు.

 Ways To Keep Your Kidneys Healthy,kidneys Health,kidneys,kidney Infection,stones-TeluguStop.com

అయితే రోజువారి జీవన విధానం, ఆహారపు అలవాట్లే కిడ్నీలో సమస్యలకి కారణం అని వైద్య నిపుణులు చెబుతున్నారు.కిడ్నీ( Kidney ) లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి.

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలామందికి ఒక చెడు అలవాటు ఉంటుంది.ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకి కూడా మందులు వేసుకుంటూ ఉంటారు.ఇది కిడ్నీలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

ఎందుకంటే మందులు మూత్ర పిండాలకు హాని కలిగించేలా పనిచేస్తాయి.అందుకే వైద్యుల సలహా లేకుండా ఎటువంటి మందులను ఉపయోగించకూడదు.

కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మంచి ఆహారం తీసుకోవాలి.దీని వల్ల అధిక రక్తపోటు( High Blood Pressure ), ఊబకాయం( Obesity ), మధుమేహం( Diabetes ) వంటి సమస్యలు దూరం అవుతాయి.

అదే సమయంలో ఆహారంలో కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలను ఉండేలా చూసుకోవడం మంచిది.ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువగా నీరు త్రాగడం అలవాటు చేసుకోవాలి.నీరు కిడ్నీలని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.దీనివల్ల కిడ్నీ లలో రాళ్లు, కిడ్నీ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు రావు.స్మోకింగ్( Smoking ) కిడ్నీలను దెబ్బతీస్తుంది.మరోవైపు మద్యం తాగడం వల్ల కిడ్నీ సరిగా పనిచేయదు.

కిడ్నీ సమస్యలు రాకూడదనుకున్న వారు ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.ఇంకా చెప్పాలంటే ఉదయం ప్రతి రోజు 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.

దీని కారణంగా మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube