కొమురం భీం జిల్లా( Kumuram Bheem Asifabad )లో బీభత్సం సృష్టించిన ఏనుగును పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు.ఈ మేరకు గజరాజును అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పెంచికల్ పేట – బెజ్జూర్ మండలాల సరిహద్దు ప్రాంతంలో ఏనుగు ఉన్నట్లు సమాచారం.దీంతో ఆ ప్రాంతంలో గజరాజు కోసం ఫారెస్ట్ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు.
మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతం నుంచి ఏనుగు తప్పిపోయి వచ్చినట్లు భావిస్తున్నారు.కాగా పెంచికల్ పేట మండలం కొండపల్లి( Kondapalli )లో పొలంలో ఓ రైతును తొక్కి చంపింది.
నిన్న ఏనుగు దాడిలో శంకర్ అనే వ్యక్తి మృతిచెందిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో గజరాజు సంచారం నేపథ్యంలో 16 గ్రామాల్లో అటవీశాఖ అధికారులు అలర్ట్ ప్రకటించారు.
గ్రామ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.