ఒడ్డున ఉన్న చేపపై మెరుపు దాడి చేసిన మొసలి.. ఒళ్ళు గగుర్పొడిచే వీడియో వైరల్..

నీటిలో ఉంటూ చాలా సులువుగా వేటాడే జంతువుల్లో మొసలి( Crocodile ) కూడా ఒకటి.మొసలి ఒకసారి దాడి చేసిందంటే అవతల ఉన్నది ఎంత పెద్ద జంతువు అయిన ప్రాణాలు విడిచి దానికి ఆహారం అవ్వాల్సిందే.

 Electric Eel Kills The Alligator Video Viral Details, Viral News, Latest News, T-TeluguStop.com

ఇక నీటిలోనే బ్రతికే చేపల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో మాత్రం దీనికి రివర్స్ లో ఉంది.

మొసలి ఒడ్డున ఉన్న ఒక చేపపై( Fish ) దాడి చేసింది.ఆ చేప మొసలి నోటోకి అందగానే ఒక ఊహించని సంఘటన జరిగింది.

అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక నది కొన్ని చేపలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి.వాటిని గమనించిన మొసలి నెమ్మదిగా నది ఒడ్డుకు చేరుకుంటుంది.వెంటనే చేపలన్నీ అక్కడి నుండి పారిపోతాయి.

అందులో ఒక చేప మాత్రం మొసలి నోటికి చిక్కుతుంది.ఎప్పుడైతే ముసలి ఆ చేపను నోట కరుచుకొని పట్టుకుంటుందో ఒక షాకింగ్ సంఘటన జరుగుతుంది.

అదేంటంటే మొసలి పట్టుకుంది ఒక ఎలక్ట్రిక్ ఈల్ చేప.( Electric Eel Fish ) అది తెలియక దాన్ని తినేద్దామని మొసలి చేపను గట్టిగా నోటితో పట్టుకుంటుంది.

అయితే ఎలక్ట్రిక్ ఈల్ చేపలకు స్వతహా గానే తమ మీద దాడి చేసే శత్రువులను కరెంటు షాక్ తో( Current Shock ) చంపేసే పవర్ ఉంటుంది.అలానే మొసలి ఆ ఈల్ చేపను పట్టుకోగానే వెంటనే అది పవర్ రిలీజ్ చేసింది.దాంతో మొసలికి షాక్‌ కొట్టి చాలాసేపు గిలగిలా కొట్టుకొని చివరికి ప్రాణాలు విడుస్తుంది.ఈ ఘటనలో మొసలి నోటికి చిక్కిన చేప కూడా చనిపోతుంది.ఈ ఘటనను అక్కడ ఉన్నవారు వీడియో తీశారు.ఆ వీడియోను తాజాగా సోషల్ మీడియాలో రీషేర్ చెయ్యగా 15 వేలకు పైగా లైక్స్ ని సొంతం చేసుకుంది.ఈ వీడియో చూసిన వాళ్ళు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.‘వామ్మో ఈ చేపను చూస్తే భయమేస్తుంది’ అంటూ కొందరు, ‘మొసలి ప్లేస్ లో మనిషి ఉంటే పరిస్థితి ఏంటి ‘ అంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube