తమ మిత్రపక్షంగా ఉన్న బిజెపిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చిక్కుల్లో పడేశారు.బిజెపి , జనసేన ఏపీలో అధికారికంగా పొత్తు పెట్టుకున్నాయి.
వచ్చే ఎన్నికల్లోను కలిసి పోటీ చేయాలని నిర్ణయంతో ఉన్నాయి.టిడిపిని కలుపుకుని వెళ్లేందుకు పవన్ చాలా కాలంగా బిజెపి నాయకులపై ఒత్తిడి చేస్తూనే ఉన్నా, ఈ విషయంలో ఆ పార్టీ నాయకులు ఏ క్లారిటీ ఇవ్వడం లేదు.
అయితే ఎన్నికల సమయం నాటికి ఏదో రకంగా బిజెపిని ఒప్పించి మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లి వైసీపీని ఓడించాలనే పట్టుదలతో పవన్ ఉంటూ వచ్చారు.అయితే ఆకస్మాత్తుగా టిడిపి అధినేత చంద్రబాబు ( Chandrababu )అవినీతి ఆరోపణలతో జైలు పాలుకావడంతో ఆయనను పరామర్శించేందుకు వెళ్లిన పవన్ బయటకు వచ్చిన తర్వాత పొత్తుల అంశంపై కీలక ప్రకటన చేశారు.
వచ్చే ఎన్నికల్లో టిడిపి , జనసేన పార్టీలు ( TDP JanaSena )కలిసి పోటీ చేయబోతున్నాయని, బిజెపి( BJP ) కూడా తమతో కలిసి వస్తే బాగుంటుందని పవన్ వ్యాఖ్యానించారు.పవన్ అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం పై బిజెపి నేతలు ఏ విధంగా స్పందించాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.ఇప్పటికే చంద్రబాబు అరెస్టుపై ఏపీ బీజేపీ నేతలు స్పందించారు.చంద్రబాబు అరెస్టు అక్రమం అని, ఆయనను అరెస్టు చేసిన విధానం సరికాదంటూ మొదటి రోజు మాట్లాడిన బిజెపి నేతలు ఆ తర్వాత సైలెంట్ అయ్యారు.
కానీ తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం ఇప్పటికీ చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో స్పందిస్తూ, వైసిపి ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు.ఈ వ్యవహారం ఇలా ఉంటే తమ మిత్రపక్షంగా ఉన్న జనసేన టిడిపి తో పొత్తు పెట్టుకోబోతుందనే విషయాన్ని తమకు మాట మాత్రం అయినా చెప్పకుండా అకస్మాత్తుగా ఈ ప్రకటన చేయడం తో తాము ఏ ప్రకటన చేయాలో అర్థం కాని పరిస్థితి బీజేపీలో నెలకొంది.
బిజెపి అగ్ర నేతలు మాత్రం టిడిపితో జనసేన పొత్తు( TDP JanaSena ) పెట్టుకోవడాన్ని సీరియస్ గానే తీసుకుంటున్నారు .
ఆ పార్టీతో కలిసి వెళ్లేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు.అయితే ఏపీ బీజేపీ నేతలు కొంతమంది మాత్రం జనసేన టిడిపి తో కలిసి ఎన్నికలకు వెళ్తామని ప్రకటన చేస్తున్నారు. దీంతో అధికారికంగా ఈ పొత్తుల అంశంపై స్పందించాల్సిన పరిస్థితి బీజేపీపై పడింది.
టిడిపి తో కలిసి వెళ్లేందుకు ఇష్టపడకపోతే జనసేనని కూడా వదులుకోవాల్సి ఉంటుంది.అలా అని ఏపీలో ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా లేకపోవడంతో, ఈ విషయంలో ఏం చేయాలి ఏ విధంగా ముందుకు వెళ్లాలి ఏ నిర్ణయాన్ని ప్రకటించాలి అనే విషయంలో తర్జభర్జనలు పడుతోంది.
మొత్తంగా పవన్ టిడిపి తో పొత్తు అంశాన్ని ప్రస్తావించి తమ మిత్రపక్షంగా ఉన్న బిజెపిని ఇరకాటంలో పెట్టారు.