జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) “వారాహి విజయ యాత్ర”( Varahi Vijaya Yatra ) తొలి బహిరంగ సభ కత్తిపూడి లో నిర్వహించడం జరిగింది.ఈ సభలో పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీపై(YCP ) తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం జరిగింది.
వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో వైసీపీ పార్టీని మళ్ళీ అధికారంలోకి రాకుండా ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.ఈసారి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గోదావరి జిల్లాల ప్రజల చేతిలో ఉందని వ్యాఖ్యానించారు.
అధికారం లేకపోతేనే ఇంత పోరాటం చేస్తున్నాను…కాస్తా అధికారం ఇచ్చి చూడండి.ఈసారి జనసేన పార్టీని అసెంబ్లీలోకి వెళ్లేలా ప్రజలు సహకరించాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.
నేను రూపాయి తీసుకోను, రూపాయి అవినీతి జరగనివ్వకుండా చూసుకుంటాను అని మాట ఇవ్వడం జరిగింది.ప్రజాదానం దుర్వినియోగం చెయ్యను.ఏది ఏమైనా ఈసారి నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికలు రాబోతున్నాయి.ఆయనేదో కథలు చెబుతున్నారు.వచ్చే మే నెలలో లేదా మార్చి నెలలో అని బయటికి చెబుతున్నా కానీ మరోపక్క… ఎన్నికల కమిషన్ తో మాట్లాడుకుంటూ … వచ్చే ఎన్నికలకు రెడీ అయిపోతున్నారు అంటూ వైఎస్ జగన్ పై పరోక్షంగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఏది ఏమైనా జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో కచ్చితంగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.