అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణాలోని వికారాబాద్ కి చెందినా అర్షద్ మహ్మద్ అనే వ్యక్తి మరణించాడు.అతడు మరణించగా మరో ముగ్గురు గాయాలపాలయ్యారు.ఈ ఘటన వివరాలలోకి వెళ్తే.
గురువారం చికాగోలోని వెటరన్స్ మెమోరియల్ టోల్‌వే వద్ద.
ఒక వ్యక్తి రాంగ్ రూట్ లో రావడంతో అదుపు తప్పినా ఓ కారు ఒక్క సారిగా బ్రేకు వేయడంతో ఒకదాని తరువాత మరొకటి డీ కొట్టుకున్నాయి.ఈ ప్రమాదంలోనే అర్షద్ మరణించాడు, ముగ్గురుకి తీవ్ర గాయాలు అయ్యాయి.
వెనువెంటనే భాదితులని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఇదిలాఉంటే యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినోయిస్‌లో ఆర్థోడాంటిక్స్ కోర్స్ చేస్తున్న అర్షద్ బ్లూమింగ్‌డేల్‌లోని తన సోదరి ఇంట్లో ఉంటున్నాడు.అతడి మరణ వార్త విన్న తల్లి తండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.అర్షద్ అంత్యక్రియలు అమెరికాలోనే జరుగుతాయని , అతని తల్లి తండ్రులు అక్కడే వెళ్తారని తెలుస్తోంది.
తాజా వార్తలు