దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ).అమ్మాయిల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు.
సీతరామం సినిమా తర్వాత ఇతగాడి పేరు చెప్తే లేడీ ఫ్యాన్స్ కి పిచ్చెక్కి పోతుంది.ప్రతి అమ్మాయికి ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఉండాలని కోరుకుంటారు.
పైగా పెళ్లయిన హీరోలపై చాలా మందికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు.కానీ దుల్కర్ పెళ్లి చేసుకున్నా కూడా అతడి కి అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు.
పైగా క్యూట్ లుక్స్ లో కనిపిస్తూ ఈ మధ్య సోషల్ మీడియా లో అతడి హంగామా పెరిగి పోయింది.దుల్కర్ చిన్నతనం నుంచి హీరో అవ్వాలని అనుకోలేదు.
మొదట కెరీర్ కూడా సినిమా ఇండస్ట్రీ లో కాకుండా బయట చూసుకున్నాడు.దుబాయ్( Dubai ) లో కొన్ని రోజుల పాటు ఉద్యోగం కూడా చేశాడు.
కానీ తన రక్తంలోనే నటన ఉంది.
అలాంటప్పుడు అతడు నటుడు కాకుండా ఎలా ఉంటాడు చెప్పండి.మమ్ముట్టి( Mammootty ) కి కూడా కొడుకు ఇండస్ట్రీ లోకి పెద్దగా నచ్చలేదు.అయినా కూడా అతడు నటుడు అవ్వాలని ఫిక్స్ అయ్యాక తండికి ఇష్టం లేకపోయినా నటించడం మొదలు పెట్టాడు.
ఇక కొద్ది రోజులకే హీరోగా నిలదొక్కు కున్నాడు.ఇప్పుడు టాలీవుడ్ తో పాటు సౌత్ ఇండియా లోనే స్టార్ హీరోలలో ఒకడిగా ఒక వెలుగు వెలుగుతున్నాడు.
హిందీ లో కూడా దుల్కర్ సల్మాన్ తనదైన రీతిలో సినిమాలు చేస్తున్నాడు.ఇక చాలా మంది సినిమా ఇండస్ట్రీ లో ఉన్న వారికి అన్ని రకాల అలవాట్లు ఉంటాయని అనుకుంటారు.
అయితే ఎవరికి తెలియని విషయం ఏమిటంటే దుల్కర్ సల్మాన్ కి ఎలాంటి చెడు అలవాట్లు లేవు.
ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్లు అన్నిటికి దుల్కర్ చాలా దూరంగా ఉంటాడట.తనతోటి హీరోలతో ఖాళీగా ఉన్న సమయాల్లో చిల్ అవుతూ ఉంటాడు.కానీ దుల్కర్ సల్మాన్ మాత్రం సరదాగా స్నేహితులతో గడుపుతాడు కానీ ఆ సమయంలో ఎలాంటి డ్రింక్స్ కూడా తీసుకోడట.
ఇంత మంచి లక్షణాలు ఉన్న నటులు ఇండస్ట్రీ లో చాలా అరుదుగా ఉంటారు.ఏదేమైనా తల్లిదండ్రుల పెంపకం బట్టి పిల్లలు తమ అలవాట్లను, జీవితంలో లక్షణాలను డిసైడ్ చేసుకుంటారు.
మమ్ముట్టి తన కొడుకును ఇంత ప్రయోజకుడిగా తీర్చి దిద్దాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు.