హీరోయిన్ టబుకు హైదరాబాద్ పెద్ద బంగ్లా.. దాని విశేషాలు మీకు తెలుసా...?

హీరోయిన్ టబు( Tabu ) గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.నాగార్జునతో కలిసి ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

 Heroine Tabu Hyderabad House Details , Tabu , Hyderabad, House, Premadesam , S-TeluguStop.com

ప్రేమదేశం సినిమాతో కూడా తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచేసింది.ఈ అందాల తార చాలా ముందు చూపు ఉన్న హీరోయిన్ కూడా అందుకే ఇండియాలో మూడు విలాసమంతమైన ఇళ్లు నిర్మించుకుంది.

వీటి విలువ కోట్లలో ఉంటుందని సమాచారం.సినిమాల ద్వారా వెనకేసిన డబ్బులతో ఆ ఇళ్లను ఈ ముద్దుగుమ్మ కొనుగోలు చేసిందని అంటారు.

ఈ అందాల తారకు ఉన్న మూడు ఇళ్లలో ఒకటి హైదరాబాద్‌లో, ఇంకొకటి ముంబైలో, మరొకటి గోవాలో ఉన్నాయి. హైదరాబాద్‌లో ఉన్న ఆమె ఇల్లు మహారాజుల బంగ్లాలకు ఏమాత్రం తీసిపోదు.

Telugu Bollywood, Hyderabad, Nagarjuna, Premadesam, Pool, Tabu, Tollywood-Movie

ఆమె ప్రత్యేకంగా ఈ నగరంలోనే ఇంత పెద్ద ఇల్లు కొనుగోలు చేయడానికి ఒక కారణం ఉంది.అదేంటంటే ఈ తార అక్కడే పుట్టింది.యుక్త వయసులో ఉన్నప్పుడు భాగ్యనగరంలో ఒక పెద్ద ఇల్లు నిర్మించుకోవాలని ఎప్పుడూ అనుకునేది.ఆ కోరికను ఎట్టకేలకు నెరవేర్చుకుంది.ఈమె అసలు పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మీ.1971 నవంబర్ నాలుగు నుంచి జన్మించిన ఈ తారకు ప్రస్తుతం 52 ఏళ్ల వయసు ఉంది.అయినా చూసేందుకు 30 ఏళ్ల హీరోయిన్ లాగా కనిపిస్తోంది.

Telugu Bollywood, Hyderabad, Nagarjuna, Premadesam, Pool, Tabu, Tollywood-Movie

టబు హైదరాబాద్( Hyderabad ) నగరంలో 1996లో భూమి కొనుగోలు చేసింది.2003లో ఇంటిని నిర్మించడం స్టార్ట్ చేస్తే 2005లో గృహప్రవేశం చేశామని తెలిపింది.అత్యంత ఖరీదైన ఏరియాలలో ఒకటైన జూబ్లీహిల్స్ లో ఆమె ఇల్లు ఉంది.

అక్కినేని నాగార్జున ఇంటికి చాలా దగ్గరలోనే ఆమె బంగ్లా ఉంది.టబు హైదరాబాద్ బంగ్లా అర ఎకరం విస్తీర్ణంలో నిర్మించారట.

దాంట్లో ఏకంగా 5 బెడ్రూమ్స్ ఉన్నాయని మీడియా రిపోర్ట్స్ వెల్లడించాయి.ఇందులో అతి పెద్ద ఫిష్ పాండ్, అత్యాధునిత పరికరాలతో జిమ్, టెర్రస్ పైన స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి.

మొట్టమొదటి ఫ్లోర్‌లో ఆమె ఆఫీస్ ఉంటుంది.అక్కడ సినిమా వారిని ఆమె కలుస్తుంటుంది.

బర్మీస్ టేకుతో ఈ ఇంటిలోని ఫర్నిచర్ తయారు చేశారని అంటారు.ఇదే టేకుతో ఇంట్లోని మెట్లు కూడా నిర్మించారు.

ఇందులోని టైల్స్ రాజస్థాన్ మార్బుల్స్ తో తయారు చేశారు.ఇంత పెద్ద ముంబైలో కూడా కొనగలనని కానీ హైదరాబాద్లో చాలా చీప్ గా వస్తుంటే ఇక్కడే అత్యంత పెద్ద స్థలంలో పెద్ద ఇల్లు కట్టించుకున్నానని ఆమె చెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube