బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు రాజమౌళి ( Rajamouli ) ఆ సినిమా తర్వాత వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా( RRR ) కూడా సూపర్ సక్సెస్ అయింది.దింతో ఇప్పుడు బాలీవుడ్ హీరోలు సైతం రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి సిద్ధం గా ఉన్నారు.
కానీ రాజమౌళి బాలీవుడ్ హీరోలతో కాకుండా తెలుగు సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు తో( Mahesh Babu ) ఒక సినిమా చేయడానికి సిద్దమవుతున్నాడు.ప్రస్తుతం రాజామౌళి ఆర్ ఆర్ ఆర్ కి సంభందించిన అవార్డ్స్ విషయంలో బిజీ గా ఉన్నారు అలాగే మహేష్ బాబు కూడా మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ సినిమాలో బిజీగా ఉన్నాడు ఈ సినిమా అయిపోయిన తర్వాత మహేష్ బాబు రాజమౌళి సినిమాలో జాయిన్ అవుతాడు.
రాజమౌళి అన్ని సినిమాలకి వాళ్ళ నాన్న విజయేంద్ర ప్రసాద్( Vijayendra Prasad ) గారే స్టోరీలని అందించారు.ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ కూడా లేని డైరెక్టర్ గా పేరు సంపాదించారు రాజమౌళి.
అలాగే ఈ సినిమాకి కూడా ఆయనే స్టోరీ ఇస్తున్నారు ఈ సినిమా స్టోరీ జేమ్స్ బాండ్ మూవీస్ తరహాలో ఉంటుందని తెలుస్తుంది దీని కోసం మహేష్ కూడా ఇప్పటి వరకు ఎప్పుడు లేని మేకోవర్ తో మనకు కనిపిస్తాడు అని రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పారు.

ఇక ఈ కథ విషయానికి వస్తే ఆఫ్రికా అడవుల్లో స్టార్ట్ అయి ప్రపంచ దేశాలన్నిటిని కలుపుతూ ఈ సినిమా స్టోరీ ఉంటుందని ఈ సినిమా పాన్ వరల్డ్ గా రాబోతుంది కాబట్టి అలాంటి సబ్జెక్టు ని రెడీ చేశామని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు…హీరో అడవుల్లో బ్రతుకుతూ ఉంటాడు అలాంటి హీరో కి ఒక రోజు ఒక నిధి కి సంభందించిన వివరాలు తెలుస్తాయి ఆ నిధికి హీరో కి సంభందం ఏంటి ఆ నిధి హీరో కి దొరుకుతుందా లేదా అనేదే కథ…ఈ మొత్తం కథ దీన్నే బేస్ చేసుకొని ఉంటుంది అని తెలుస్తుంది

ఆద్యంతం ఉత్కంఠను కలిగించే విధంగా ఈ సినిమా ఉంటుందని ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ఇప్పటి వరకు రాజమౌళి సినిమాల్లో కానీ,వేరే సినిమాల్లో కానీ ఎక్కడ చూసి ఉండరు అనేంత రేంజ్ లో ఉండే విధం గా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు అని తెలుస్తుంది…రాజమౌళి సినిమాలన్నింటి కంటే కూడా ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది అని తెలుస్తుంది…చూడాలి మరి రాజమౌళి గత సినిమాల మాదిరి ఈ సినిమా కూడా హిట్ అవుతుందో లేదో…
.