ఈమధ్య సినిమా చూసే ప్రేక్షకుల ఆలోచనలు మొత్తం మారిపోయాయి.సినిమాను సినిమా లాగా చూడకుండా అందులో పూర్తిగా మునగడానికి ప్రయత్నిస్తున్నారు.
మంచి మంచి సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలకు బాగా అలవాటు పడుతున్నారు.అందుకే యాక్షన్, కామెడీ సినిమాలు కాస్త వెనుకబడి పోతున్నాయి.
చాలామంది దర్శకులు కూడా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని సినిమాలను చేస్తున్నారు.ఈ కాలం యూత్ ఎటువంటి సినిమాలను చూస్తున్నారు అనేది దృష్టిలో పెట్టుకొని మరి తీస్తున్నారు.
ఇప్పుడు అటువంటిదే హీట్ సినిమా.( Heat Movie ) డైరెక్టర్ ఎం ఎన్ అర్జున్, శరత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా హీట్.
ఇక ఈ సినిమాలో వర్ధన్, స్నేహఖుషి, మోహన్ సాయి, అంబికా వాణి ప్రధాన పాత్రలో నటించారు.ఇక గౌతమ్ రవి రామ్ ఈ సినిమాకు సంగీతం అందించగా.
రోచిత్ బాచు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టాడు.ఇక ఈ సినిమాకు ఎమ్మార్ వర్మ, సంజోష్ నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టారు.
ఇక ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.
కథ:
కథ విషయానికి వస్తే.ఇందులో అభి (వర్ధన్ గుర్రాల), సిరిల్ (మోహన్ సాయి)( Mohan Sai ) బెస్ట్ ఫ్రెండ్స్.దీంతో వీరిద్దరూ సొంతంగా ఒక కంపెనీని కూడా నడుపుతారు.
అయితే వీరికి మలేషియా ప్రాజెక్టు విషయంలో స్టీఫెన్ అనే వ్యక్తితో సమస్యలు వస్తాయి.అదే సమయంలో సిరిల్ తను ప్రేమించిన ఆరాధ్య (అంబికా వాణి) ను( Ambika Vani ) చర్చిలో పెళ్లి చేసుకుంటాడు.
ఇక తన చెల్లి కులాంతర, మతాంతర వివాహం చేసుకుందని రుద్ర కోపంతో రగిలిపోతాడు.ఆవేశంలో వారిని చంపేయాలని అనుకుంటాడు.
దీంతో సిరిల్, ఆరాధ్య కనిపించకుండా పోతారు.ఇక అభి తన స్నేహితుడు సిరిల్ ను ఎలా కాపాడుతాడు.
ఆ సమయంలో తనకు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి.మైకేల్ అనే వ్యక్తి వీళ్లకు ఎలా ఎదురుపడతాడు.చివరికి ఏం జరుగుతుంది అనేది మిగిలిన కథలోనిది.
నటినటుల నటన:
అభి, సిరిల్, మైకెల్ తమ పాత్రలతో అద్భుతంగా మెప్పించారు.సినిమా మొత్తం వీరి చుట్టే తిరుగుతుంది.ఫ్రెండ్ కోసం అభిపడే ఆరాటన బాగా ఆకట్టుకుంది.ఇక మిగతా నటీనటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్:
టెక్నికల్ విషయానికి వస్తే ఈ సినిమా రొటీన్ స్టోరీ అయినప్పటికీ కూడా ఎక్కడ బోరింగ్ కొట్టకుండా డైరెక్టర్ ఈ సినిమాను అద్భుతంగా చూపించాడు.సంగీతం పరవాలేదు.సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది.మిగిలిన నిర్మాణ విభాగాలు సినిమాకు తగ్గట్టుగా పని చేశాయి.
విశ్లేషణ:
మామూలుగా సస్పెన్స్ అనే కాన్సెప్టును చాలామంది ప్రేక్షకులు ఇష్టపడుతూ ఉంటారు.అందుకే డైరెక్టర్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఈ కథను చూపించాడు.కథ ఊహించినదగ్గట్లు అనిపించినా కూడా చివరి వరకు మంచి ఫీలింగ్ తో తీసుకెళ్లాడు.
ప్లస్ పాయింట్స్:
సైకోథ్రిల్లర్, అద్భుతమైన స్క్రీన్ ప్లే, నటీనటుల నటన, నిర్మాణ విలువలు.
మైనస్ పాయింట్స్:
రొటీన్ స్టోరీ లాగా అనిపించింది.సెకండ్ ఆఫ్ కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపించింది.
బాటమ్ లైన్:
చివరిగా చెప్పాల్సిందేంటంటే కథలో కొత్తదనం లేకపోయినా కూడా బోరింగ్ అనే ఫీలింగ్ లేకుండా చూపించాడు డైరెక్టర్.ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లింగ్ ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది అని చెప్పాలి.