బుల్లితెరపై ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమాలలో జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమానికి చాలా మంచి క్రేజ్ ఉంది.మల్లెమాలవారు జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ( Sridevi Drama Company ), ఢీ డాన్స్ షో కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు.
ఇకపోతే తాజాగా కొరియోగ్రాఫర్ చైతన్య ( Chaitanya ) మరణించిన విషయం మనకు తెలిసిందే.ఈయన మరణించే ముందు ఒక సెల్ఫీ వీడియో ద్వారా తన మరణానికి గల కారణాలను తెలియజేశారు.
అలాగే ఈ వీడియోలో జబర్దస్త్ కార్యక్రమంలోని వారికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారని, ఢీ షోలో చేసే వారికి రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఇస్తున్నారు అంటూ కామెంట్ చేశారు.
చైతన్య ఈ కామెంట్స్ పై అదిరే అభి( Adhire Abhi ) తన అభిప్రాయాలను తెలియజేశారు.అదిరే అభి సైతం జబర్దస్త్ కార్యక్రమంలో టీం లీడర్ గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ప్రస్తుతం ఈయన ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్న మల్లెమాల( Mallemala ) వారి గురించి ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే స్పందిస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే చైతన్య చేసిన వ్యాఖ్యలపై అభి స్పందిస్తూ.సాధారణంగా మనం ఇండస్ట్రీలోకి వచ్చేముందు ప్లాన్ ఏ మాత్రమే కాకుండా ప్లాన్ బి కూడా ముందుగా ఆలోచించి పెట్టుకోవాలి.
ఎందుకంటే మనకు ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయో రావో తెలియదు అలాంటప్పుడు మనం ప్లాన్ బి ఉపయోగించుకొని కెరియర్ లో ముందుకు వెళ్లాలని తెలిపారు.
ఇక ఇండస్ట్రీలో వచ్చిన సంపాదనలో కాస్త మనం సేవింగ్స్ చేసుకోవడం కూడా ఎంతో ముఖ్యం.వచ్చినది వచ్చినట్టు ఖర్చు చేస్తే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని అందుకే కొంత కూడా పెట్టడం చాలా ముఖ్యమని తెలిపారు.ఇక ఇండస్ట్రీలోకి ఎవరిని కూడా రెడ్ కార్పెట్స్ వేసి ఆహ్వానించరు, ఎవరి కష్టం వారిది.
ఇక జబర్దస్త్ కార్యక్రమంలో రెమ్యూనరేషన్ ( Remuneration )ఎక్కువగా ఇస్తున్నారు అంటున్నారు అయితే మల్లెమాలవారు ఏ కార్యక్రమాన్ని పక్షపాతంగా చూడరని అయితే రెమ్యూనరేషన్ అనేవి ఆ కార్యక్రమానికి వచ్చే టిఆర్పీ రేటింగ్స్ బట్టి ఉంటాయని అభి తెలిపారు.జబర్దస్త్ చాలామందికి రీచ్ అవుతుంది కనుక ఇక్కడ పనిచేసే వారికి రెమ్యూనరేషన్ కూడా అధికంగా ఉంటాయి.
ఏ కార్యక్రమం అయినా రేటింగ్ బట్టి వారికి రెమ్యూనరేషన్ ఉంటుంది అంటూ ఈ సందర్భంగా అభి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.